గ్లాస్ పగిలిపోతుంది, సైకిల్‌కు తుప్పు పట్టింది: కేఏ పాల్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 27, 2019, 07:37 AM IST
గ్లాస్ పగిలిపోతుంది, సైకిల్‌కు తుప్పు పట్టింది: కేఏ పాల్ వ్యాఖ్యలు

సారాంశం

ప్రజాశాంతి పార్టీ అధినేత, కేఏ పాల్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అన్ని పార్టీలకు నినాదం ఉన్నట్లు తన పార్టీ శ్రేణులకు కొత్త నినాదం ఇచ్చారు. ‘‘పాల్ రావాలి- పాలన మారాలి’’ అనే నినాదంతో ముందుకెళ్లాలని ఆయన పాస్టర్లకు పిలుపునిచ్చారు. 

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పాస్టర్ల సమావేశంలో పాల్ మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో తనను గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే రూ. 7 లక్షల కోట్లు తెచ్చి ఏపీని అమెరికాలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

పగిలిపోయే గాజు గ్లాసు, తుప్పు పట్టిన సైకిల్, ఫ్యాన్ పార్టీలకు ఓటు వేయవద్దని ప్రజలను కోరారు. తన ఆస్తి రూ.3.5 లక్షల కోట్లు ట్రస్టులకు ఇచ్చేశానని, ప్రస్తుతం తనకు రూపాయి ఆస్తి కూడా లేదన్నారు.

జగన్ గెలిపిస్తే అవినీతి రాజ్యమేలుతుందని మండిపడ్డారు. కాగా, ప్రజాశాంతి పార్టీ తరపున నరసాపురం ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కేఏ పాల్ వేసిన నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించింది. 

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్