డేటా చోరీ చేసిన గజదొంగ చంద్రబాబు: వైఎస్ జగన్

Published : Mar 05, 2019, 04:03 PM IST
డేటా చోరీ చేసిన గజదొంగ చంద్రబాబు: వైఎస్ జగన్

సారాంశం

వైసీపీ సానుభూతి పరులకు కానీ ఇతర పార్టీల సానుభూతిపరులకు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. డేటా చోరీ చూస్తే అందులో తెలుస్తోందన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు డేటా చోరీ చేసిన గజదొంగ అని అలాంటి దొంగలు రాష్ట్రాన్ని పాలించడం దురదృష్టకరమన్నారు.   

నెల్లూరు: తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకాలకు దిగుతోందని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం ఆ పార్టీ కార్యకర్తలకే అందుతున్నాయని ఆరోపించారు. 

వైసీపీ సానుభూతి పరులకు కానీ ఇతర పార్టీల సానుభూతిపరులకు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. డేటా చోరీ చూస్తే అందులో తెలుస్తోందన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు డేటా చోరీ చేసిన గజదొంగ అని అలాంటి దొంగలు రాష్ట్రాన్ని పాలించడం దురదృష్టకరమన్నారు. 

ఐటీ శాఖమంత్రిగా ఉన్న నారా లోకేష్ ఏపీకి ఏం చేశారో తెలియదు కానీ డేటాను మాత్రం చోరీ చెయ్యడంలో సిద్ధహస్తుడంటూ ధ్వజమెత్తారు. దొంగతనం చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పకుండా నీతులు చెప్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కనుగోలు చేసిన చంద్రబాబు సిగ్గులేకుండా వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టి రాజకీయ నైతిక విలువలకు తిలోదకాలిచ్చారంటూ మండిపడ్డారు. రాజకీయాల్లో విశ్వసనీయతలేని వ్యక్తి, నైతిక విలువలు లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.     

ఈ వార్తలు కూడా చదవండి

ఓట్లను తొలగిస్తున్నారు, చంపేందుకు కూడా వెనుకాడరు: బాబుపై జగన్

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu