డేటా దొంగతనం చేసింది తెలంగాణ పోలీసులే.. కనకమేడల

By ramya NFirst Published Mar 5, 2019, 2:36 PM IST
Highlights

డేటా చోరీ విషయంలో.. తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు. 

డేటా చోరీ విషయంలో.. తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు. ఏపీలో పౌరుల డేటా చోరీ జరిగిందని తెలంగాణలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా..దీనిపై కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు. తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ నేతల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మా డేటాను తెలంగాణ పోలీసులు చోరీ చేశారని.. అర్థరాత్రి లోకేశ్వర్ రెడ్డి ఇచ్చిన దొంగ రిపోర్టుతో కేసు నమోదు చేసి ఉదయాన్నికల్లా ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు.

బీజేపీ డైరెక్షన్ లో టీఆర్ఎస్, వైసీపీ కలిసి చంద్రబాబును ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం పై ఫిర్యాదు వస్తే.. ఆ కేసును ఏపీకి బదిలీ చేయాల్సిన బాధ్యత తెలంగాణ పోలీసులదని.. ఎన్నికల్లో గందరగోళాలు సృష్టించి చంద్రబాబును ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. తెల్ల కాగితాలపై సంతకాలు చూసి.. హైకోర్టు చీవాట్లు పెట్టిందని గుర్తు చేశారు. 

click me!