రాజధాని గురించి అడిగితే బాహుబలి గ్రాఫిక్స్ గురించి చెప్తున్నాడు: చంద్రబాబుపై జగన్ మండిపాటు

Published : Mar 05, 2019, 04:23 PM IST
రాజధాని గురించి అడిగితే బాహుబలి గ్రాఫిక్స్ గురించి చెప్తున్నాడు: చంద్రబాబుపై జగన్ మండిపాటు

సారాంశం

పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ వంటి ప్రభుత్వ పథకాల ద్వారా చెక్కులు పంపిణీ చేస్తున్నారని ఆ చెక్కులు ప్రస్తుతం చెల్లడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు నానా నాటకాలు వేస్తున్నారని కొత్త సినిమాలు చూపిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఆరో బడ్జెట్ పేరుతో సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.   

నెల్లూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఐదేళ్లలో ఏపీకి చేసిందేమీ లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ తరహారాజధాని నిర్మిస్తానని చెప్పుకొచ్చిన చంద్రబాబు ఎక్కడ నిర్మించారో ఎవరికీ తెలియడం లేదన్నారు. రాజధాని ఏది చంద్రబాబు అంటే బాహుబలి గ్రాఫిక్స్ చూపిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

నెల్లూరు వైసీపీ సమర శంఖారావం సభలో పాల్గొన్న వైఎస్ జగన్ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను, దళితుల భూములను, రైతుల భూములను దోచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తారు. 

అమరావతి నిర్మాణం అంటూ రైతుల నుంచి మోసపూరితంగా భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఐదేళ్లలో రాజధాని నిర్మాణం చెయ్యలేని చంద్రబాబును ప్రజలు రాబోయే ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలని కోరారు. 

ఐదేళ్లపాటు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చెయ్యకుండా నాటకాలు ఆడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడ లేని హామీలు ఇస్తున్నారంటూ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నవరత్నాలను, హామీలను కాపీ కొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. 

వైసీపీ పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి, రైతులకు భరోసా, ఆటో, ట్రాక్టర్ల లైప్ ట్యాక్స్ రద్దు వంటి అంశాలను చంద్రబాబు నాయుడు కాపీ కొట్టారంటూ చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ ఏ హామీ ఇస్తే ఆ హామీని అమలు చేస్తున్నాడంటూ చెప్పుకొచ్చారు. 

పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ వంటి ప్రభుత్వ పథకాల ద్వారా చెక్కులు పంపిణీ చేస్తున్నారని ఆ చెక్కులు ప్రస్తుతం చెల్లడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు నానా నాటకాలు వేస్తున్నారని కొత్త సినిమాలు చూపిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఆరో బడ్జెట్ పేరుతో సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. 
 
ఈ వార్తలు కూడా చదవండి

డేటా చోరీ చేసిన గజదొంగ చంద్రబాబు: వైఎస్ జగన్

ఓట్లను తొలగిస్తున్నారు, చంపేందుకు కూడా వెనుకాడరు: బాబుపై జగన్

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu