శ్రీధరణిపై అత్యాచారం, హత్య: నలుగురి అరెస్ట్

By narsimha lodeFirst Published Mar 3, 2019, 6:21 PM IST
Highlights

: పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీధరణిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నలుగురిని ఆదివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.


ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీధరణిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నలుగురిని ఆదివారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

గత నెల 24వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని బౌద్ధారామాలయాల వద్ద ఏకాంతం కోసం వెళ్లిన ప్రేమ జంట నవీన్, శ్రీధరణిలపై దుండగులు దాడికి పాల్పడ్డారు.  శ్రీధరణిపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఒంటరి జంటలను లక్ష్యంగా చేసుకొని  ఈ గ్యాంగ్ పనిచేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్‌లో ముగ్గురు యువకులు, ఓ యువతి ఉంది.

ఈ గ్యాంగ్‌పై గతంలో 32 కేసులు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ గ్యాంగ్ గతంలో కృష్ణా జిల్లాలో ఇద్దరిని, ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరిని హత్య చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

ఈ గ్యాంగ్ కృష్ణా జిల్లాకు చెందిన వారేనని పోలీసులు చెప్పారు.  ఈ గ్యాంగ్‌కు రాజు లీడర్‌ గా ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.  శ్రీధరణి హత్యతో ఈ గ్యాంగ్  అరాచకాలు వెలుగుచూశాయి. ప్రతి 10 రోజులకు ఈ గ్యాంగ్  దాడికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

'దండుపాళ్యం' సినిమా ఎఫెక్ట్: 14 మందిపై రేప్

శ్రీధరణి హత్య: రాజు బాగోతాలు వెలుగులోకి...
శ్రీధరణి హత్యకేసులో ట్విస్ట్: రాజు ఆచూకీ ఇలా దొరికింది

click me!