వైసీపీలోకి అంధ పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లా

By Siva KodatiFirst Published Mar 8, 2019, 11:44 AM IST
Highlights

అంధత్వం తన లక్ష్యానికి అడ్డుకాదని నిరూపించి పారిశ్రామిక వేత్తగా ఎదిగిన శ్రీకాంత్ బొల్లా ఇకపై రాజకీయాల్లోనూ తన సత్తా చాటాలనుకుంటున్నారు. దీనిలో భాగంగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు

అంధత్వం తన లక్ష్యానికి అడ్డుకాదని నిరూపించి పారిశ్రామిక వేత్తగా ఎదిగిన శ్రీకాంత్ బొల్లా ఇకపై రాజకీయాల్లోనూ తన సత్తా చాటాలనుకుంటున్నారు. దీనిలో భాగంగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు.

కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన శ్రీకాంత్...పుట్టుగుడ్డి. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న తల్లిదండ్రులు కుమారుడిని భారంగా భావించకుండా కష్టపడి చదివించారు. తల్లిదండ్రుల నమ్మకాన్నినిలబెట్టిన శ్రీకాంత్ పాఠశాల నుంచి కాలేజీ వరకు ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.

అమెరికాలోని మసూచ్ సెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ప్రవేశాన్ని పొందిన తొలి అంధ విద్యార్ధిగా ఆయన గుర్తింపు పొందాడు. అగ్రరాజ్యంలో ఉన్నత చదువులు పూర్తి చేసిన శ్రీకాంత్‌కు అనేక కార్పోరేట్ కంపెనీలు కొలువులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.

కానీ ఆయన మాత్రం భారత్‌కు తిరిగి వచ్చేసి వికలాంగుల కోసం ఏమైనా చేయాలనుకున్నాడు. అలా పూర్తిగా వికలాంగులే ఉద్యోగులే పేపర్ ప్లేట్లు, గ్లాసులు తయారు చేసే కంపెనీని స్థాపించాడు. ప్రతి ఏడాది వృద్ధి చెందుతూ ఇప్పుడు సంవత్సరానికి రూ.50 కోట్లకు పైగా టర్నోవర్ సాధించే స్థాయికి కంపెనీని చేర్చాడు.

ఈ క్రమంలో రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్న శ్రీకాంత్ బొల్లా.... వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్ధితుల్లో జగన్ ఒక్కరే సమర్ధుడైన నాయకుడిగా కనిపిస్తున్నాడని ప్రజల ఆకాంక్షలను, ఆశలను ఆయన నెరవేరుస్తారని నమ్ముతున్నట్లు శ్రీకాంత్ ఒక సందర్భంలో చెప్పారు. 

కళ్లు లేవు: అందరి కళ్లు తెరిపించాడు

click me!