ఉదయం వైసీపీలోకి.. సాయంత్రానికి తిరిగి టీడీపీలోకి..

By ramya NFirst Published Mar 8, 2019, 9:19 AM IST
Highlights

ఎన్నికల వేళ.. నేతలు, కార్యకర్తలు పార్టీలు మారడం సహజం. ఏ పార్టీలోకి వెళితే తమకు లాభం చేకూరుతుందో చూసుకొని మరీ నేతలు పార్టీలు మారుతుంటారు.

ఎన్నికల వేళ.. నేతలు, కార్యకర్తలు పార్టీలు మారడం సహజం. ఏ పార్టీలోకి వెళితే తమకు లాభం చేకూరుతుందో చూసుకొని మరీ నేతలు పార్టీలు మారుతుంటారు. అయితే.. తాజాగా.. కొందరు కార్యకర్తలు ఉదయం ఒక పార్టీ లో చేరి.. సాయంత్రం కల్లా తిరిగి తమ సొంత పార్టీలోకిచేరిపోయారు. ఈ సంఘటన గుంటూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. వ్యక్తిగత కారణాలు ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న తమను ఆదుకుంటామని ప్రతిపక్ష పార్టీ నాయకుల మాటలు నమ్మి ఉదయం టీడీపీని వదలి వైసీపీలో చేరామని పార్టీలో చేరిన తరువాత ఆ పార్టీ నాయకులు చెప్పిన మాటలు అబద్దమని తెలిసి తిరిగి సాయంత్రానికి తెలుగుదేశం పార్టీలో చేరిన కార్యకర్తల సంఘటన మండల పరిధిలోని మునగోడు గ్రామంలో జరిగింది.

గ్రామానికి చెందిన కొందరు స్థానిక నాయకుల మాటలు విని నియోజకవర్గ ఇన్‌చార్జి నంబూరి శంకరరావు సమక్షంలో క్రోసూరు పార్టీ కార్యాలయంలో వైసీపీలో చేరారు. కండువాలు వేసిన తరువాత తమను ఆదుకుంటామని చెప్పి భోజనం పెట్టి పంపించారని కోపంతో మరలా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌ వద్దకు వచ్చి తాము తప్పు చేశామని తాము టీడీపీ కట్టుబడి ఉంటామని మళ్లీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

click me!