టీడీపీలో చేరిన ఉగ్ర నరసింహారెడ్డి: టికెట్ పై తేల్చని చంద్రబాబు

By Nagaraju penumalaFirst Published Mar 2, 2019, 9:34 PM IST
Highlights

నాలుగు రోజుల క్రితం చంద్రబాబుతో భేటీ అయిన కదిరి బాబూరావు ఉగ్రనరసింహారెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని తనకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో ప్రకాశం పార్లమెంట్ అభ్యర్థిగానైనా బరిలోకి దించాలని సూచించారు. త్వరలోనే తన నిర్ణయం వెల్లడిస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 

అమరావతి: ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా పేరున్న ఉగ్రనరసింహారెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. శనివారం రాత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొద్ది రోజులుగా ఉగ్రనరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడతారంటూ ప్రచారం జరుగుతుంది. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. ఉగ్రనరసింహారెడ్డి టీడీపీలోకి వస్తే తన టికెట్ ఎసరువస్తుందని గ్రహించిన ఆయన ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. 

నాలుగు రోజుల క్రితం చంద్రబాబుతో భేటీ అయిన కదిరి బాబూరావు ఉగ్రనరసింహారెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని తనకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో ప్రకాశం పార్లమెంట్ అభ్యర్థిగానైనా బరిలోకి దించాలని సూచించారు. త్వరలోనే తన నిర్ణయం వెల్లడిస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 

ఉగ్రనరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంపై సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు స్వాగతం పలికారు. ఉగ్రనరసింహారెడ్డి తెలుగుదేశంలో చేరడం శుభపరిణామమన్నారు. ఆయన రాకతో టీడీపీ మరింత బలోపేతం అవుతుందన్నారు. 

కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించేందుకు కలిసి పనిచెయ్యాలని సూచించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచెయ్యాలంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే  ఉగ్రనరసింహారెడ్డి 2009లో కనిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారా అన్న చర్చ జరుగుతుంది.ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారా లేక కనిగిరి నుంచి పోటీ చేస్తారా అన్న చర్చ  మెుదలైంది. 
 

click me!