చంద్రబాబుకు షాక్: వైసీపీలోకి రఘురామకృష్ణం రాజు

By Nagaraju penumalaFirst Published Mar 2, 2019, 8:32 PM IST
Highlights

ఈనేపథ్యంలో ఆదివారం ఉదయం 10గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్రం కార్యాలయం అయిన లోటస్ పాండ్ లో వైఎస్  జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. తిరిగి సొంతగూటికి చేరుకోనున్నారు.

నర్సాపురం: పశ్చిమగోదావరి జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. నర్సాపురం టీడీపీ ఇన్ చార్జ్ రఘురామకృష్ణం రాజు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఆదివారం ఉదయం 10గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ వీడతారంటూ ప్రచారం జరుగుతుంది. 

నర్సాపురం పార్లమెంట్ టికెట్ పై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణం రాజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. అయితే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. 

బీజేపీలో కూడా ఇమడలేకపోయిన ఆయన అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయనను నర్సాపురం లోక్ సభ ఇన్ చార్జ్ గా చంద్రబాబు నియమించారు. అయితే నర్సాపురం పార్లమెంట్ టికెట్ పై చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇవ్వడం లేదు. 

ఇన్ చార్జ్ పదవి ఇచ్చారు కానీ సీటు కన్ఫమ్ చెయ్యాలంటూ గతంలో చంద్రబాబును కోరారు. చంద్రబాబు నాయుడు నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆఖరి నిమిషంలో టికెట్ ఇవ్వకపోతే తన పరిస్థితి ఏంటన్నదానిపై పునరాలోచనలో పడ్డారు. టికెట్ విషయంపై రఘురామకృష్ణంరాజు అభిమానులు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమైంది. 

దీంతో కార్యకర్తల సూచనమేరకు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈనేపథ్యంలో ఆదివారం ఉదయం 10గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్రం కార్యాలయం అయిన లోటస్ పాండ్ లో వైఎస్  జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. తిరిగి సొంతగూటికి చేరుకోనున్నారు.

వైఎస్ జగన్ నర్సాపురం పార్లమెంట్ టికెట్ ఇచ్చేందుకు అంగీకరించారని తెలుస్తోంది. ఇకపోతే రెండు రోజుల క్రితం తాను టీడీపీ వీడేది లేదని చెప్పుకొచ్చారు. కానీ ఆకస్మాత్తుగా వైసీపీలో చేరుతున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. 

రఘురామకృష్ణం రాజు కాంగ్రెస్ పార్టీ కీలక నేత వైఎస్ ఆత్మ అయినటువంటి కేవీపీ రామచంద్రరావుకు స్వయానా వియ్యంకుడు కావడం విశేషం. మరోవైపు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. 

  
 

click me!