చినజీయర్ స్వామిని కలిసిన వైఎస్ జగన్ (వీడియో)

By Nagaraju penumalaFirst Published Mar 2, 2019, 8:19 PM IST
Highlights

ఏపీ రాజకీయ పరిణామాలు, పార్టీలో ఎదురవుతున్న సమస్యలపై జగన్ చర్చించనట్లు సమాచారం.  ఇకపోతే ప్రజా సంకల్పయాత్ర ముగిసిన తర్వాత వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామిని కలిశారు. స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. వరుసగా స్వామీజీలను వైఎస్ జగన్ కలవడం రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. 

హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామిని కలిశారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నేరుగా చినజీయర్ ఆశ్రమానికి వెళ్లారు. శంషాబాద్ మండలం ముచ్చింతలోని ఆశ్రమంలో స్వామితో జగన్ భేటీ అయ్యారు. 

ఆశ్రమానికి చేరుకున్న వైఎస్ జగన్ కు చినజీయర్ స్వామి స్వాగతం పలికారు. చినజీయర్ స్వామి కాళ్లకు పాదాభివందనం చేశారు వైఎస్ జగన్. అనంతరం అరగంట పాటు చర్చించుకున్నారు. జగన్‌తో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ మిధున్‌రెడ్డి కూడా చినజీయర్ స్వామిని కలిసిన వారిలో ఉన్నారు. 

గతంలో కూడా చినజీయర్ స్వామిని జగన్ కలిశారు. అప్పుడు జగన్‌ వెంట మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు ఉన్నారు. ఆ సమయంలోనూ సుమారు 30 నిమిషాలపాటు వైఎస్ జగన్ చినజీయర్ స్వామితో సమావేశమయ్యారు. ఏపీ రాజకీయ పరిణామాలు, పార్టీలో ఎదురవుతున్న సమస్యలపై జగన్ చర్చించనట్లు సమాచారం.  

"

ఇకపోతే ప్రజా సంకల్పయాత్ర ముగిసిన తర్వాత వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామిని కలిశారు. స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. వరుసగా స్వామీజీలను వైఎస్ జగన్ కలవడం రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

click me!