చంద్రబాబును చూసి ఎవరూ ఓటెయ్యరు: జేసీ సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Mar 2, 2019, 3:59 PM IST
Highlights

సీఎం చంద్రబాబు నాయుడు తనను చూసి ఓట్లేస్తారని భావిస్తున్నారని కానీ అది సాధ్యం కాదన్నారు. చేసేదంతా ఎమ్మెల్యేలు అయితే చంద్రబాబు నాయుడును ఎవరు చూస్తారంటూ చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే 40 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనని స్పష్టం చేశారు.  

అనంతపురం: వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తనను చూసి ఓట్లేస్తారని భావిస్తున్నారని కానీ అది సాధ్యం కాదన్నారు. 

చేసేదంతా ఎమ్మెల్యేలు అయితే చంద్రబాబు నాయుడును ఎవరు చూస్తారంటూ చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే 40 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనని స్పష్టం చేశారు.  

ఎట్టి పరిస్థితుల్లో 40 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనని స్పష్టం చేశారు. మార్చితేనే చంద్రబాబు రాజ్యం వస్తుందని లేకపోతే కష్టమేనన్నారు. ఇటీవలే 40 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలంటూ చంద్రబాబు ను కలిశారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. 

తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్న సమయంలో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తొలుత అనంతపురం పార్లమెంట్ పరిధిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి ఈసారి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలంటూ వ్యాఖ్యలు చెయ్యడంతో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుబులు రేగుతోంది. 
 

click me!