స్నేహితుడి కూతురిపై కన్నేసి..

Published : Mar 02, 2019, 03:26 PM IST
స్నేహితుడి కూతురిపై కన్నేసి..

సారాంశం

గుంటూరు జిల్లాలో ఇటీవల కలకలం సృష్టించిన శ్రీజ్యోతి హత్య కేసులో ఎట్టకేలకు పోలీసులు నిందితుడు శ్రీనివాసరావు(40) ని అరెస్టు చేశారు. 


గుంటూరు జిల్లాలో ఇటీవల కలకలం సృష్టించిన శ్రీజ్యోతి హత్య కేసులో ఎట్టకేలకు పోలీసులు నిందితుడు శ్రీనివాసరావు(40) ని అరెస్టు చేశారు. అతని ద్వారా హత్యకు దారి తీసిన నిజానిజాలను పోలీసులు రాబట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలోని హిందూ ముస్లిం రోడ్డులో జ్యోతి(20) కుటుంబసభ్యులతో నివసిస్తోంది. కాగా జ్యోతి తండ్రికి నిందితుడు శ్రీనివాసరావు మిత్రుడు. కొంతకాలం క్రితం భార్యతో విడిపోయి ఒంటరిగా నివసిస్తున్నాడు. కాగా.. అతని కన్ను జ్యోతిపై పడింది. ఎలాగైనా జ్యోతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు.

ఇదే విషయమై.. జ్యోతి తల్లిదండ్రులను కూడా సంప్రదించాడు. వాళ్లు అంగీకరించలేదు. ఈ క్రమంలో జ్యోతి తల్లిదండ్రులకు ఆమెకు మరో వివాహం నిశ్చయం చేశారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు.. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకొని శ్రీజ్యోతి ఇంటికి వెళ్లి.. ఒంటరిగా ఉన్న ఆమెపై చాకుతో దాడి చేశాడు. గొంతులో పలుమార్లు పొడిచి హత్య చేశాడు.

కాగా, నిందితుడు వేద టాకీస్‌ పక్క సందులోని అతని మామయ్య ఇంట్లో ఉండగా గురువారం అదుపులోకి తీసుకున్నట్టు సీఐ తెలిపారు. సత్యనారాయణను కోర్టులో హాజరు పరచగా  న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు.

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?