
నిజాయితీపరులంతా తమ పార్టీలో చేరుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంపింగ్ లు ఎక్కువైన సంతి తెలిసిందే. పలువురు టీడీపీ నేతలు.. వైసీపీ బాట పట్టగా.. ఇతర పార్టీల సీనియర్ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా..దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.
దశాబ్ధాల వైరాన్ని పక్కనపెట్టి టీడీపీకి సంఘీభావం తెలుపుతున్నారంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. నిజాయితీ పరులంతా టీడీపీలో చేరుతున్నారని హర్షం వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లాలో కోట్ల, కేఈ కుటుంబాలు.. విజయనగరం జిల్లాలో బొబ్బిలి, గజపతి రాజులే ఇందుకు సాక్ష్యామని చంద్రబాబు పేర్కొన్నారు. కడప జిల్లాల్లో విభిన్న వర్గాలన్నీ ఏకమై టీడీపీతో కలిశాయన్నారు. రాష్ట్రమంతటా ఇదే స్ఫూర్తి రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.