దొంగే దొంగ అన్నట్లుంది వైసీపీ తీరు: వర్మ

By Nagaraju penumalaFirst Published Mar 1, 2019, 7:04 PM IST
Highlights

టీడీపీ సానుభూతి ఓట్లను తొలగించేందుకే వైసీపీ డ్రామాలాడుతోందని ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 90 వేల ఓట్లను తొలగించమని వైసీపీ దరఖాస్తులు ఇచ్చిందని తెలిపారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలని దరఖాస్తులు చేస్తున్నారని ఇది సరికాదన్నారు. 

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పిఠాపురం ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దొంగే దొంగ అని అరుస్తున్నట్లుగా వైసీపీ తీరు ఉందని ఆయన ఆరోపించారు. అమరావతిలో సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిన ఎమ్మెల్యే వర్మ ఓట్ల తొలగింపు అంతా ఓ కుట్ర అంటూ చెప్పుకొచ్చారు. 

టీడీపీ సానుభూతి ఓట్లను తొలగించేందుకే వైసీపీ డ్రామాలాడుతోందని ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 90 వేల ఓట్లను తొలగించమని వైసీపీ దరఖాస్తులు ఇచ్చిందని తెలిపారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలని దరఖాస్తులు చేస్తున్నారని ఇది సరికాదన్నారు. 

ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ప్రశాంత్‌ కిషోర్‌ సలహాలు ఇస్తున్నారని వర్మ ఆరోపించారు. తన నియోజకవర్గమైన పిఠాపురంలో 6వేల ఓట్లను తొలగించాలని దరఖాస్తు చేశారన్నారు. టీడీపీని ఓడించడానికే వైసీపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. 

click me!