ఆరునూరైనా కొవ్వూరు నుంచే పోటీ చేస్తా : మంత్రి జవహర్

Published : Mar 01, 2019, 06:27 PM IST
ఆరునూరైనా కొవ్వూరు నుంచే పోటీ చేస్తా : మంత్రి జవహర్

సారాంశం

ఆరునూరైనా తాను కొవ్వూరు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్నారు. కొందరు అహంకారంతో చేసే పనులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెగేసి చెప్తున్నారు. కొందరు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ హద్దు దాటిని వారిపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.   

అమరావతి: తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగ రగులుతోంది. ఒకవైపు గెలుపు గుర్రాలపై చంద్రబాబు నాయుడు దృష్టి సారిస్తుంటే అంతకు రెట్టింపుతో అసంతృప్త వాదులు రగిలిపోతున్నారు. క్రమశిక్షణ విషయంలో ముందుండే తెలుగు తమ్ముళ్లు అదుపుతప్పుతున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. 

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో అయితే అసంతృప్తి మామూలుగా లేదు. మంత్రి జవహర్ పై అసంతృప్తులు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. జవహర్ కి ఇస్తే ఓడించి తీరుతామని సాక్షాత్తు చంద్రబాబుకే చెప్పడం గమనార్హం. అయితే మంత్రి జవహర్ మాత్రం కొవ్వూరు సీటు వదులుకునేందుకు సిద్ధంగా లేరు. 

ఆరునూరైనా తాను కొవ్వూరు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్నారు. కొందరు అహంకారంతో చేసే పనులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెగేసి చెప్తున్నారు. కొందరు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ హద్దు దాటిని వారిపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. 

ఇకపోతే శుక్రవారం ఉదయం సీఎం చంద్రబాబు నివాసం వద్ద కొవ్వూరు నియోజకవర్గ నేతల సమావేశం రసాభాసగా మారింది. పరిశీలకుల సమీక్ష సమావేశంలో కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. 

జవహర్‌కు మళ్లీ టికెట్ ఇవ్వొద్దని నినాదాలు చేశారు. ఒకవేళ టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ కార్యకర్తలు హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ శిబిరంలో గుబులు రేపుతోంది. జవహర్ కానీ ప్రత్యర్థి వర్గం కానీ ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో టీడీపీ అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబుకు తలనొప్పి: టీడీపీలో సిట్టింగ్‌లకు అసమ్మతి సెగ

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!