బాబుకు షాక్: వైసీపీలో చేరిన రఘురామకృష్ణంరాజు

Published : Mar 03, 2019, 10:44 AM ISTUpdated : Mar 03, 2019, 12:48 PM IST
బాబుకు షాక్: వైసీపీలో చేరిన రఘురామకృష్ణంరాజు

సారాంశం

టీడీపీకి మరో షాక్ తగిలింది.  పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత రఘురామకృష్ణం రాజు ఆదివారం నాడు వైసీపీలో చేరారు.

అమరావతి:టీడీపీకి మరో షాక్ తగిలింది.  పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత రఘురామకృష్ణం రాజు ఆదివారం నాడు వైసీపీలో చేరారు.. కొంతకాలంగా రఘురామకృష్ణంరాజు వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.

ఆదివారం నాడు హైద్రాబాద్ లోటస్‌పాండ్‌లో రఘురామకృష్ణం రాజు జగన్‌తో భేటీ అయ్యారు.  ఏడాది క్రితం రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో రఘురామకృష్ణం రాజును బరిలోకి దింపాలని టీడీపీ ప్లాన్ చేసింది.

అయితే ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు  ప్రశాంత్‌కిషోర్‌ను కూడ  కలిసినట్టుగా టీడీపీ నేతలకు సమాచారం అందింది. దీంతోనే నరసాపురం ఎంపీ టిక్కెట్టు విషయమై  అభ్యర్ధిగా రఘురామకృష్ణంరాజును ఫైనల్ చేయలేదని అంటున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌ను రఘురామకృష్ణంరాజు కలిశారు. జగన్ సమక్షంలో రఘురామకృష్ణంరాజు వైసీపీలో చేరారు.

సంబంధిత వార్తలు

పార్టీ మార్పుపై తేల్చేసిన రఘురామకృష్ణంరాజు
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu