ప్రపంచమంతా భారత్ వెంట, మీవి పాక్ కు అనుకూలమైన మాటలు: బాబుపై మోదీ ఫైర్

By Nagaraju penumalaFirst Published Mar 1, 2019, 8:10 PM IST
Highlights

ఇక్కడ నేతలు భారతదేశాన్ని బలహీన పరిచేలా చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ పార్లమెంట్ లో చర్చకు వచ్చాయంటే ఎంతటి కుట్ర దాగి ఉందో అర్థమవుతుందన్నారు. ఇక్కడ నేతలు చేసిన వ్యాఖ్యలు భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని, బలాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. 
 
విశాఖపట్నం: ఇటీవల భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న యుద్ధ వాతావరణంలో ప్రపంచ దేశాలన్నీ పాకిస్థాన్ ను హెచ్చరిస్తుంటే ఇక్కడ కొందరు నేతలు తమను నిందిస్తున్నారని మోదీ ఆరోపించారు. 

విశాఖపట్నంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యమేవ జయతే బహిరంగ సభలో పాల్గొన్న మోదీ చంద్రబాబు నాయుడు లక్ష్యంగా నిప్పులు చెరిగారు. ప్రపంచమంతా భారత్ కు మద్దతు పలుకుతుంటే భారతదేశాన్ని బలహీన పరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ విరుచుకుపడ్డారు. 

ఇక్కడ నేతలు భారతదేశాన్ని బలహీన పరిచేలా చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ పార్లమెంట్ లో చర్చకు వచ్చాయంటే ఎంతటి కుట్ర దాగి ఉందో అర్థమవుతుందన్నారు. ఇక్కడ నేతలు చేసిన వ్యాఖ్యలు భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని, బలాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. 

భావసారూప్యత లేని పార్టీలు కూటమిగా ఏర్పడి తమ బలహీనతను దేశంపై చూపించాలని చూస్తోందని ఆరోపించారు. దేశంలో ఒక ధృఢమైన ప్రభుత్వం ఉన్నప్పుడే దేశం కూడా సుభిక్షంగా ఉంటుందన్నారు. 

సైనికులు సంతోషంగా ఉండాలన్నా కేంద్రంలో బీజేపీ ఉండాల్సిందేనన్నారు. ప్రజలు అంతా గమనించి భావసారూప్యత లేని మహాకూటమికి తగిన బుద్ధి చెప్పాలని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి

దశాబ్ధాల కల నెరవేర్చా, కావాలనే కొందరు అసత్య ప్రచారం: చంద్రబాబుపై మోడీవ్యాఖ్యలు

యూటర్న్ సీఎం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు: మోదీ

click me!