చంద్రబాబుకి మరో దెబ్బ.. టీడీపీని వీడనున్న మరో సీనియర్ నేత

Published : Mar 02, 2019, 09:53 AM IST
చంద్రబాబుకి మరో దెబ్బ.. టీడీపీని వీడనున్న మరో సీనియర్ నేత

సారాంశం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి దెబ్బమీద దెబ్బ పడుతోంది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది పార్టీని వీడగా.. తాజాగా మరో సీనియర్ నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.

తిరుపతి మాజీ మున్సిపల్ ఛైర్మన్ కందాటి శంకర్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన చేశారు. ‘టీడీపీతో విడదీయరాని అనుబంధం ఉంది. ఏళ్లుగా ప్రజాసేవకే అంకితమయ్యా. ఇప్పుడు విధేయుల అభిమతం మేరకు రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది’ అని ఆయన అన్నారు.

తన అనుచరులతో భేటీ అయిన ఆయన.. పార్టీ వీడేందుకు తీసుకున్న నిర్ణయాన్ని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తనకు పార్టీతో, అధినేత చంద్రబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందని చెబుతూనే.. తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం