భారత్ కు అభినందన్, ఇదేనా మీ దేశభక్తి అంటూ మోదీపై చంద్రబాబు ఫైర్

By Nagaraju penumalaFirst Published Mar 2, 2019, 8:11 AM IST
Highlights

తమ దేశభక్తిని ఎవ్వరూ శంకించలేరని చెప్పుకొచ్చారు. సౌదీ అరేబియా ప్రిన్స్ వస్తే స్వయంగా వెళ్లి ప్రధాని రిసీవ్ చేసుకున్నారని అలాంటిది అభినందన్ దేశానికి తిరిగి వస్తుంటే ప్రధాని రిసీవ్ చేసుకోకుండా టీడీపీని విమర్శించడానికి విశాఖ వచ్చారంటూ ధ్వజమెత్తారు. అభినందన్‌ని రిసీవ్ చేసుకోకుండా విశాఖకు రావడమేనా మీ దేశభక్తి అంటూ నిలదీశారు. 

అమరావతి: భారత ప్రధాని నరేంద్రమోదీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ పాక్ చెర నుంచి భారత్ గడ్డకు వస్తే రిసీవ్ చేసుకోవాల్సింది పోయి తమను విమర్శిస్తారా అంటూ మండిపడ్డారు. 

పరాయి దేశం హింసలు పెట్టినా చలించలేదని అభినందన్ కొనియాడుతూనే మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభినందన్ క్షేమంగా తిరిగి వస్తే మనమంతా సంతోషంగా ఉన్నామన్న బాబు ఏపీలో ప్రధాని మోదీ మాత్రం నల్ల జెండాలతో స్వాగతం అందుకున్నారని విమర్శించారు. 

తమ దేశభక్తిని ఎవ్వరూ శంకించలేరని చెప్పుకొచ్చారు. సౌదీ అరేబియా ప్రిన్స్ వస్తే స్వయంగా వెళ్లి ప్రధాని రిసీవ్ చేసుకున్నారని అలాంటిది అభినందన్ దేశానికి తిరిగి వస్తుంటే ప్రధాని రిసీవ్ చేసుకోకుండా టీడీపీని విమర్శించడానికి విశాఖ వచ్చారంటూ ధ్వజమెత్తారు. అభినందన్‌ని రిసీవ్ చేసుకోకుండా విశాఖకు రావడమేనా మీ దేశభక్తి అంటూ నిలదీశారు. 

పుల్వామా ఘటన జరిగే సమయంలో రాజస్థాన్‌లో రాజకీయ సభల్లో పాల్గొన్న మోదీ తమని నిందిస్తారా అంటూ మండిపడ్డారు. రాజకీయాలను దేశభక్తితో ముడిపెట్టడం మోదీకి సరికాదన్నారు. 

ఎన్నికల కోసం దేశ భద్రతను పణంగా పెట్టడం మంచి పద్ధతి కాదంటూ హితవు పలికారు. యుద్ధం వచ్చింది కాబట్టి ఎన్నికల్లో గెలుస్తామంటూ బీజేపీ మాజీ సీఎం యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలే బీజేపీ రాజకీయానికి నిదర్శనం అంటూ చంద్రబాబు విమర్శించారు. 
 
click me!