మోడీకి, జగన్ కు లింక్ పెడుతూ హీరో శివాజీ ఘాటు వ్యాఖ్యలు

Published : Mar 02, 2019, 08:37 AM IST
మోడీకి, జగన్ కు లింక్ పెడుతూ హీరో శివాజీ ఘాటు వ్యాఖ్యలు

సారాంశం

ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సమాధానం చెబుతుందని శివాజీ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం తానే పోరాటం చేశానని చెప్పిన జగన్ ప్రత్యేక హోదా విషయంలో మోడీని ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. 

విజయవాడ: ప్రధాని నరేంద్రమోడీకి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లింక్ పెడుతూ తెలుగు సినీ హీరో శివాజీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, బీజేపీ రహస్య సంబంధం మరోసారి బయట పడిందని ఆయన అన్నారు. 70 శాతం సోషల్ మీడియా వెబ్‌సైట్‌లు వైసీపీవేనని అన్నారు. 

ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సమాధానం చెబుతుందని శివాజీ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం తానే పోరాటం చేశానని చెప్పిన జగన్ ప్రత్యేక హోదా విషయంలో మోడీని ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. 

ఏపీకి మోదీ శత్రువు.. మోడీకి ఎవరు మిత్రులైనా మాకు శత్రువులేనని అన్నారు.. పుల్వామా ఘటన మోడీ వైఫల్యమేనని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన అంతా బూటకమని ఆయన అన్నారు. 

మోడీ ప్రకటించిన విశాఖ జోన్..వేరుశెనగకాయ పంట పండింది కానీ దానిలో విత్తనాలు లేవనే విధంగా శివాజీ వ్యాఖ్యానించారు.

PREV
click me!

Recommended Stories

Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు
YS Jagan Pressmeet: చంద్రబాబు, పవన్ పై వైఎస్ జగన్ పంచ్ లు| Asianet News Telugu