రైల్వేజోన్ ఒక్కటే కాదు మరిన్ని ప్రకటనలు వస్తాయి: దగ్గుబాటి పురంధీశ్వరి

Published : Feb 27, 2019, 08:13 PM IST
రైల్వేజోన్ ఒక్కటే కాదు మరిన్ని ప్రకటనలు వస్తాయి: దగ్గుబాటి పురంధీశ్వరి

సారాంశం

బీజేపీ టార్గెట్ గా ప్రతిపక్షాలు విమర్శలు చేశాయని ఆమె మండిపడ్డారు. సాంకేతిక అవరోధాలను అధిగమించి విశాఖ రైల్వేజోన్ ప్రకటించినట్లు తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు. 

హైదరాబాద్: విశాఖ రైల్వే జోన్ ప్రకటించడంపై ఆ పార్టీ జాతీయ నాయకురాలు కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధీశ్వరి హర్షం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ఇవ్వము అని చెప్పకున్నా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయని ఆరోపించారు. 

బీజేపీ టార్గెట్ గా ప్రతిపక్షాలు విమర్శలు చేశాయని ఆమె మండిపడ్డారు. సాంకేతిక అవరోధాలను అధిగమించి విశాఖ రైల్వేజోన్ ప్రకటించినట్లు తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు. 

దశాబ్ధాలుగా పెండింగ్ లో ఉన్న విశాఖకు  రైల్వే జోన్ ప్రకటించిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. మార్చి 1న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో మరిన్ని ప్రకటనలు వెల్లడిస్తారని కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధీశ్వరి తెలిపారు. 
     
ఈ వార్తలు కూడా చదవండి

విశాఖ రైల్వే జోన్ కు కేంద్ర గ్రీన్ సిగ్నల్: అధికారికంగా ప్రకటించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్

PREV
click me!

Recommended Stories

రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతోంది ముఖ్యమంత్రి ఎక్కడ: లక్ష్మీ పార్వతి | Lakshmi Parvathi Comments
సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna