లోకేష్ కి ఆ ఉద్యోగం కూడా రాదు.. విజయసాయి రెడ్డి సవాల్

Published : Mar 05, 2019, 02:01 PM IST
లోకేష్ కి  ఆ ఉద్యోగం కూడా రాదు.. విజయసాయి రెడ్డి  సవాల్

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో సారి విమర్శల దాడి చేశారు. ట్విట్టర్ వేదికగా.. లోకేష్ తెలివి తేటలపై సెటైర్లు వేశారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో సారి విమర్శల దాడి చేశారు. ట్విట్టర్ వేదికగా.. లోకేష్ తెలివి తేటలపై సెటైర్లు వేశారు. 

నారా లోకేశ్‌ తెలివి 8వ తరగతి పిల్లాడికి మించదని విజయసాయిరెడ్డి ఎధ్దేవా చేశారు. మానసిక పరిణితి, తెలివి నిర్ధారించడానికి ఐక్యూ పరీక్షలు ఉంటాయని, మంత్రి లోకేశ్ ఐక్యూ లెవల్ 8 వ తరగతి పిల్లాడికి మించదన్నారు. తండ్రి దోచుకున్న సంపద లేక పోతే పప్పునాయుడుకి కనీసం రూ.10 వేల జీతమిచ్చేజాబ్ కూడా దొరికేది కాదన్నారు. లోకేశ్‌ను ఏదైనా ఒక జిల్లాలోని అసెంబ్లీ స్థానాల పేర్లు చెప్పాలని సవాలు విసిరారు.

దేవినేని ఉమాకి ఎప్పుడూ పీడకలలే వస్తుంటాయని.. రాజధాని ఇడుపులపాయకు తరలిపోతుందనే కొత్త కల కన్నాడని ఎద్దేవా చేశారు. అసలు మీ ప్రభుత్వం రాజధాని కడితే గదా ఇంకొకరు మార్చగలిగేది అంటూ ఎద్దేవా చేశారు. 

అమరావతిలోనే రాజధాని నిర్మిస్తామని స్పష్టం చేశారు. గ్రాఫిక్స్ భ్రాంతిలోనుంచి ఉమా బయటకు రావాలని సూచించారు. చంద్రబాబు డేటా చోరీ స్కాం దేశంలోనే పెద్ద సైబర్ సాబోటేజ్ క్రైమని, రహస్య సమాచారాన్ని బజారులో పడేశారని ధ్వజమెత్తారు. 

చంద్రబాబు.. రాజకీయ పోరాటం వదిలి ప్రజలపై కసి తీర్చుకుంటున్నాడని,. మామను వెన్ను పోటు పొడిచి అధికారం లాక్కున్నాడన్నారు. ఇప్పుడు ప్రజల డేటాను దొంగిలించి వారి సర్వస్వం దోచుకునే ప్లాన్ వేశాడని దుయ్యబట్టారు. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu