స్పీకర్ కోడెలతో లగడపాటి భేటీ

Published : Mar 05, 2019, 12:54 PM IST
స్పీకర్ కోడెలతో లగడపాటి  భేటీ

సారాంశం

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కీలకనేతలు చాలా మంది ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. 

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కీలకనేతలు చాలా మంది ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మంగళవారం మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మంగళవారం భేటీ అయ్యారు. గుంటూరు నగరంలోని చుట్టుగంట సెంటర్‌లోగల ఓ హోండా షోరూమ్‌లో వీరిద్దరూ ఏకాంతంగా చర్చలు జరిపారు.

 కాగా... కోడెల-లగడపాటి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరికొద్ది రోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో వీరిద్దరూ ఏకాంతంగా చర్చలు జరపడం పట్ల పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu