అక్క మొగుడు దుర్భుద్ది.. బిడ్డకు జన్మనిచ్చిన బాలిక

Published : Mar 05, 2019, 09:32 AM IST
అక్క మొగుడు దుర్భుద్ది.. బిడ్డకు జన్మనిచ్చిన బాలిక

సారాంశం

సొంత అక్క మొగుడే.. చెర పట్టాడు. దీంతో.. మైనర్ బాలిక.. మరో బిడ్డకు జన్మనిచ్చింది. 

సొంత అక్క మొగుడే.. చెర పట్టాడు. దీంతో.. మైనర్ బాలిక.. మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సదరు బాలిక అనంతపురంలో వసతిగృహంలో ఉంటూ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అక్క, బావలు అనంతపురంలోనే ఉండటంతో అప్పుడప్పుడూ వారి ఇంటికి వెళ్లి వస్తుండేది. ఇది అదనుగా అక్క మొగుడు ఆమెను లొంగదీసుకున్నాడు. 

విద్యార్థిని గర్భం దాల్చడంతో ఆరోగ్యం బాగాలేదని కళాశాలలో చెప్పి స్వగ్రామానికి వచ్చేసింది. తల్లిదండ్రులతో ఇంట్లోనే ఉంటోంది.  ఆదివారం అర్ధరాత్రి ప్రసవవేదన పడుతున్న బాలికను అంబులెన్స్‌లో అనంతపురం తీసుకెళ్తుండగా దారిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. బాలిక ఫిర్యాదు మేరకు అనంతపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert: ద్రోణి ప్రభావంతో పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu