మోడీ కన్ను నాపై పడింది... ఐటీ అధికారులు వేధిస్తున్నారు: జయదేవ్

By Siva KodatiFirst Published Mar 4, 2019, 8:10 AM IST
Highlights

ప్రధాని నరేంద్రమోడీపై గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్, కేసీఆర్‌లతో కలిసి ప్రధాని మోడీ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు

ప్రధాని నరేంద్రమోడీపై గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్, కేసీఆర్‌లతో కలిసి ప్రధాని మోడీ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన ప్రసంగం అనంతరం మోడీ తనపై కక్ష కట్టారని ధ్వజమెత్తారు.

దీనిలో భాగంగానే ఈడీ తనను పిలిచిందని తెలిపారు. విచారణకు హాజరైన తనతో ఈడీ అధికారులు రెండు గంటల పాటు కఠినంగా వ్యవహరించారని గల్లా చెప్పారు. బడ్జెట్ ప్రసంగం తరువాత మరోసారి పలిపించారని జయదేవ్ వెల్లడించారు.

తాను పక్కాగా ట్యాక్స్ కడుతున్నా... రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్‌వన్ ట్యాక్స్ పేయర్‌ను నేనే.. తన వద్ద ఏమీ దొరకలేదు.. దీంతో తన బంధు, మిత్రులను సైతం ఐటీ అధికారులు వేధిస్తున్నారని జయదేవ్ ఆరోపించారు.

తాను ఎవరికీ భయపడనని.. అవసరమైతే జైలుకైనా వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కలిసి దేశంలో హిట్లర్ పాలన చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు.

దేశ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్య విషయాలు సైతం వారు ముగ్గురే కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. మోడీ, షాలు గుజరాత్ తరహా రాజకీయాన్ని దేశమంతా రుద్దాలని యత్నిస్తున్నారని జయదేవ్ ధ్వజమెత్తారు. ఇప్పుడు వారికి కేసీఆర్, జగన్ కలిశారని గల్లా ఎద్దేవా చేశారు.

click me!