వైసిపి కాస్త కేసిపిగా మారిపోయింది...జగన్ కు ఆయనే అధినేత: బుద్దా వెంకన్న

By Arun Kumar PFirst Published Mar 10, 2019, 2:55 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో జరగనున్నఅసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టిడిపిని దెబ్బ తీయడానికి వైఎస్సార్‌సిపి, టీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్ ఇక్కడి ప్రతిపక్ష నాయకుడికి అదిష్టానంగా మారిపోయాడని ఎద్దేవా చేశారు. ఆయన ఆదేశాల మేరకే వైఎస్సార్‌సిపి ముందుకు కదులుతోందని అన్నారు. 

కేసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ అధినేతగానే కాదు వైఎస్సార్‌సిపి అధినేతగా కూడా మారిపోయాడన్నారు. ఆ పార్టీ పేరు కూడా వైసిపి నుండి కేసిపి(కల్వకుంట చంద్రశేఖర్ రావు పార్టీ) మారారని సెటైర్లు వేశారు. ఇక జగన్ ప్యాన్ గుర్తును వదిలేని టీఆర్ఎస్ కారు గుర్తుతోనే ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు.   

తెలంగాణలో సంపాదించిన డబ్బును కేసీఆర్ వైఎస్సార్‌సిపి గెలుపుకోసం ఆంధ్రప్రదేశ్ లో ఖర్చు చేస్తున్నారని వెంకన్న ఆరోపించారు. ఇలా రహస్యంగా ముసుగు రాజకీయాలు చేయడం కంటే బహిరంగంగా ఒకే వేదిపైకి వచ్చి తమను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. అలా చేస్తే అప్పుడు తమ సత్తా ఏంటో ఇరు పార్టీలకు అర్థమవుతుందన్నారు. 

ఎవరెన్ని రాజకీయాలు చేసినా ఐపిలో మళ్లీ టిడిపి ప్రభుత్వమై ఏర్పడుతుందని వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే ఎక్కువగా ఈసారి 150కి పైగా సీట్లు టిడిపికి వస్తాయని... మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. 

click me!