కొద్ది క్షణాల్లో కూతురి పెళ్లి... కుప్పకూలిన తండ్రి

Siva Kodati |  
Published : Mar 10, 2019, 10:08 AM IST
కొద్ది క్షణాల్లో కూతురి పెళ్లి...  కుప్పకూలిన తండ్రి

సారాంశం

అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెకు అంగరంగ వైభవంగా పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు.. అయితే కూతురి పెళ్లి చూడకుండానే తండ్రి కన్నుమూశాడు

అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెకు అంగరంగ వైభవంగా పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు.. అయితే కూతురి పెళ్లి చూడకుండానే తండ్రి కన్నుమూశాడు.

వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు గ్రామానికి చెందిన సైకం రామకోటిరెడ్డి దంపతుల కుమార్తె మౌనికకు అదే గ్రామానికి చెందిన దేవరపల్లి అంజిరెడ్డితో శనివారం ఉదయం 10.55 గంటలకు పెళ్లి జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు.

ఈ క్రమంలోనే కాళ్లగోళ్ల తంతు కోసం కూతురిని వరుడి ఇంటికి పంపారు. ఈ సందర్భంగా రామకోటిరెడ్డి దంపతులు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే రామకోటిరెడ్డి ఇంటికి వెళ్లి పెళ్లి మండపం వద్దకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.

మార్గమధ్యలో ద్విచక్ర వాహనంపై నుంచి ఒక్కసారిగా కుప్పకూలారు. స్థానికులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మరణించారు. దీంతో వధూవరుల కుటుంబాల్లో విషాద వాతావరణం నెలకొంది. 

PREV
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu