పీకే చెప్పిన వారికే జగన్ టిక్కెట్లు: బాబు

By narsimha lodeFirst Published Mar 1, 2019, 5:55 PM IST
Highlights

 రాజకీయాలతో కేసుల నుండి బయటపడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు.

విజయవాడ: రాజకీయాలతో కేసుల నుండి బయటపడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు.

కృష్ణా జిల్లాలో శుక్రవారంనాడు జరిగిన  ఓ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని  కేంద్రాన్ని జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని బాబు ప్రశ్నించారు. 

పీకే అనే కన్సల్టెంట్‌కు  వైసీపీని జగన్‌ అప్పగించాడని బాబు ఆరోపించారు.  ప్రశాంత్ కిషోర్ చెప్పిన వ్యక్తులకే  టిక్కెట్లు కేటాయించడం జగన్‌ దిగజారుడుతనానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు.బాధ్యత గల వ్యక్తులెవరూ కూడ  వైసీపీలో ఉండరని బాబు అభిప్రాయపడ్డారు.

హైద్రాబాద్ నుండి ఒట్టి చేతులతో అమరావతికి వచ్చినట్టుగా  చంద్రబాబు గుర్తు చేశారు.ఆదాయం వచ్చే వాల్తేరు డివిజన్‌ను తప్పించి విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రానికి మోడీ చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తాను నల్ల చొక్కాను వేసుకొన్నట్టుగా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రజలను మోసం చేసేందుకే మోడీ విశాఖ పర్యటనకు వస్తున్నాడని బాబు విమర్శించారు.  హామీలు అమలు చేయాలని అడిగితే ఈడీతో దాడులు చేయిస్తున్నారని  మోడీపై బాబు విరుచుకుపడ్డారు. 
 

click me!