గుంటూరు పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన: అలీ కోసం గుంటూరు తూర్పు పెండింగ్

By Nagaraju penumalaFirst Published Mar 2, 2019, 11:49 PM IST
Highlights

గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ తిరిగి పోటీ చెయ్యనున్నారని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇక అసెంబ్లీ అభ్యర్థుల విషయానికి వస్తే పొన్నూరు నియోజకవర్గాన్ని ధూళిపాళ్ల నరేంద్రకు కేటాయించారు. ఇప్పటికే వరుసగా పొన్నూరు నుంచి ఐదుసార్లు గెలిచిన నరేంద్ర డబుల్ హ్యాట్రిక్ కి రెడీ అవుతున్నారు. 

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా అభ్యర్థులను దాదాపుగా ఫైనల్ చేశారు. రాష్ట్రరాజధానితో ముడిపడి ఉన్న జిల్లా కావడంతో ఈ జిల్లాలో పాగా వెయ్యాలని చంద్రబాబు వ్యూహాలకు పదును పెడుతున్నారు. 

గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ తిరిగి పోటీ చెయ్యనున్నారని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇక అసెంబ్లీ అభ్యర్థుల విషయానికి వస్తే పొన్నూరు నియోజకవర్గాన్ని ధూళిపాళ్ల నరేంద్రకు కేటాయించారు. ఇప్పటికే వరుసగా పొన్నూరు నుంచి ఐదుసార్లు గెలిచిన నరేంద్ర డబుల్ హ్యాట్రిక్ కి రెడీ అవుతున్నారు. 

అటు తాడికొండ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రవణ్ కే కేటాయించారు చంద్రబాబు. శ్రవణ్ కు టికెట్ ఇవ్వొద్దంటూ నిరసనలు వెల్లువెత్తినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదు. 

ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి భారీ సంఖ్యలో ఆశావాహులు ఉన్నారు. మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, వీరయ్య పేర్లను పరిశీలిస్తున్నారు. ఇకపోతే తెనాలి నియోజకవర్గంకు సంబంధించి ఆలపాటి రాజాకు కేటాయించారు. 

మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఆశావాహుల సంఖ్య పెద్ద లిస్ట్ ఉంది. ఈ నియోజకవర్గం నుంచి కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు, పోతినేని శ్రీనివాస్ ల పేర్లు పరిశీలనకు వచ్చాయి. 

ఇకపోతే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి మద్దాళి గిరి లేదా మైనారిటీ వర్గాలకు ఇవ్వాల్సి వస్తే సినీనటుడు అలీకి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఆశావాహుల సంఖ్య బారెడు ఉంది. దీంతో ఈ నియోజకవర్గంపై చర్చించలేదని తెలుస్తోంది.  

 గుంటూరు పార్లమెంట్
1. గల్లా జయదేవ్

అసెంబ్లీ అభ్యర్థుల వివరాలు
1. గుంటూరు తూర్పు: మద్దాళి గిరి /సినీనటుడు అలీ
2. గుంటూరు పశ్చిమ: పెండింగ్ 
3. పొన్నూరు:            :ధూళిపాళ్ల నరేంద్ర
4. తెనాలి                 :ఆలపాటి రాజా
5. మంగళగిరి            : కాండ్రు కమల/మురుగుడు హనుమంతరావు/పోతినేని శ్రీనివాస్ పేర్లు పరిశీలన
6. ప్రత్తిపాడు             :మాణిక్య వరప్రసాద్/వీరయ్య/ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
7. తాడికొండ             :శ్రవణ్ కుమార్
 

click me!