శ్రీశైలం ఆలయంలో తొక్కిసలాట..

By Arun Kumar PFirst Published Mar 4, 2019, 6:29 PM IST
Highlights

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో కొద్దిసేపటి క్రితమే తొక్కిసలాట చోటుచేసుకుంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇరు తెలుగు రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భక్తుల శ్రీశైలానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే దైవదర్శనానికి భక్తులు క్యూలైన్లలో వేచివుండగా ఒక్కసారిగా తోపులాట మొదలయ్యింది. దీంతో గందరగోళం నెలకొని తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. 

శివరాత్రి సందర్భంగా సామాన్య  భక్తులతో పాటు శిమమాల ధారులు శ్రీశైలానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఇవాళ ఉపవాస ధీక్షతో మల్లిఖార్జున స్వామిని దర్శించుకోవాలని భక్తులంతా భావించడంతో క్యూలైన్లు నిండిపోయాయి. అయితే ఒక్కసారిగా ఈ క్యూలైన్ లో గందరగోళం నెలకొని తొక్కిసలాటకు దారితీసింది.

వీఐపి దర్శనాలను ఎక్కువగా కేటాయించడంతో సామాన్యుల క్యూలైన్ మరింత పెరిగినపోయి ఈ ప్రమాదం చోటుచేసుకున్న సామాన్య భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ సిబ్బంది ముఖ్యంగా ఛైర్మన్ నిర్లక్ష్యం వల్లే తొక్కసిలాట జరిగినట్లు చెబుతున్నారు. ఇలా పండగ పూట ప్రమాదానికి కారణమైన ఆలయ ఛైర్మన్ పై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
click me!