నీలం సాహ్ని వీడియో భేటీ: కోర్టు తీర్పు తర్వాతే పరిషత్తు ఎన్నికలపై ముందుకు

By telugu teamFirst Published Apr 1, 2021, 7:10 PM IST
Highlights

ఏపీ సీఈసి నీలం సాహ్ని గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె పరిషత్ ఎన్నికలపై మాట్లాడారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కేసు హైకోర్టులో పెండింగులో ఉంది. దీంతో ఎన్నికల నిర్వహణపై ఏపీ ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్ఈసీ) నీలం సాహ్నీ సమాలోచనలు జరుపుతున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపి గౌతమ్ సవాంగ్ కూడా హాజరయ్యారు.

పరిషత్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నీలం సాహ్నీ కలెక్టర్లను, ఎస్పీలను, పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు జిల్లాల్లో కోవిడ్ పరిస్థితులపై ఆమె అడిగి తెలుసుకున్నారు. రేపు శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఆమె వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటారు 

కోర్టు తీర్పు వచ్చిన తర్వాత పరిషత్ ఎన్నికల ప్రక్రియను కొనసాగిద్దామని నీలం సాహ్నీ చెప్పారు. పరిషత్ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై విచారణను ముగించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 3వ తేదీన హైకోర్టు తీర్పు వెలువరించే అవకాసం ఉందని భావిస్తున్నారు. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే ఎన్నికల ప్రక్రియను కొనసాగిద్దామని నీలం సాహ్ని ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇదిలావుంటే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో నీలం సాహ్ని ఏపీ ఎస్ఈసీగా నియమితులయ్యారు. ఆమె గురువారం పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఆ వెంటనే కార్యాచరణలోకి దిగారు. ఆమె గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. సీఎస్ అదిత్యనాథ్ దాస్ తో సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు 

click me!