ఏపీలో విజృంభిస్తోన్న కరోనా: కొత్తగా 1,271 మందికి పాజిటివ్.. గుంటూరు, చిత్తూరులలో తీవ్రత

Siva Kodati |  
Published : Apr 01, 2021, 06:04 PM IST
ఏపీలో విజృంభిస్తోన్న కరోనా: కొత్తగా 1,271 మందికి పాజిటివ్.. గుంటూరు, చిత్తూరులలో తీవ్రత

సారాంశం

కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్,పంజాబ్, కేరళ తరహాలోనే ఏపీలోనూ పరిస్ధితి అదుపు తప్పుతోంది. రోజు రోజుకు ఇక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,271 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్,పంజాబ్, కేరళ తరహాలోనే ఏపీలోనూ పరిస్ధితి అదుపు తప్పుతోంది. రోజు రోజుకు ఇక్కడ కేసుల సంఖ్య పెరుగుతోంది.

తాజాగా గడిచిన 24 గంటల్లో 1,271 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 9,03,260కి చేరుకుంది.

కోవిడ్ వల్ల అనంతపురం, గుంటూరు, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు వైరస్ వల్ల రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 7,220కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో 464 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,87,898కి చేరుకుంది. నిన్న 31,809 మందికి కోవిడ్ టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా నిర్థారణా పరీక్షల సంఖ్య 1,51,14,988కి చేరింది.

గత 24 గంటల్లో అనంతపురం 61, చిత్తూరు 285, తూర్పుగోదావరి 27, గుంటూరు 279, కడప 63, కృష్ణ 161, కర్నూలు 52,  నెల్లూరు 43, ప్రకాశం 63, శ్రీకాకుళం 21, విశాఖపట్నం 189, విజయనగరం 15, పశ్చిమ గోదావరిలలో 12 కేసుల చొప్పున నమోదయ్యాయి.

 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu