పరిషత్ ఎన్నికలపై సాహ్ని దూకుడు: తొలి రోజే అధికారులతో సమీక్ష

By Siva KodatiFirst Published Apr 1, 2021, 5:45 PM IST
Highlights

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని. గురువారం కలెక్టర్లు, ఎస్పీలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె అభిప్రాయాలు తీసుకున్నారు. 

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని. గురువారం కలెక్టర్లు, ఎస్పీలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె అభిప్రాయాలు తీసుకున్నారు.

ఎన్నికల తేదీలు, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, టీకా పంపిణీ కార్యక్రమంపై వారు ఎస్ఈసీకి వివరించారు.

వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తే వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెడతామని నీలం సాహ్ని దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల నిర్వహణలో కోవిడ్ ప్రోటోకాల్‌ పాటిస్తామని వివరించారు. 

అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ నూతన ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్‌ఈసీగా నియమితులైన నీలం సాహ్నికి కమిషన్ కార్యదర్శి కన్నబాబు, ఇతర అధికారులు పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలియజేశారు.

కాగా ఇప్పటి వరకు ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగిన నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పదవీ కాలం మార్చి 31తో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో కొత్త ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు

click me!