హై కమాండ్ వద్దకు రాజమండ్రి పంచాయితీ: మార్గాని భరత్, జక్కంపూడి రాజాల మధ్య సర్ధుబాటు యత్నం

Published : Sep 27, 2021, 03:05 PM IST
హై కమాండ్ వద్దకు రాజమండ్రి పంచాయితీ: మార్గాని భరత్, జక్కంపూడి రాజాల మధ్య సర్ధుబాటు యత్నం

సారాంశం

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలకు వైసీపీ అధినాయకత్వం నుండి పిలుపొచ్చింది. వైవీ సుబ్బారెడ్డి ఈ ఇద్దరు నేతలతో ఈ నెల 28న భేటీ కానున్నారు. అవసరమైతే ఈ ఇద్దరిని సీఎం జగన్ వద్దకు కూడా వైవీ సుబ్బారెడ్డి తీసుకెళ్లే అవకాశం ఉంది.


రాజమండ్రి:  రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ (Rajahmundry MP  Margani Bharat), రాజానగరం ఎమ్మెల్యే (Rajanagaram MLA  Jakkampudi Raja)జక్కంపూడి రాజా మధ్య చోటు చేసుకొన్న విబేధాలను సర్దుబాటు చేసేందుకు వైసీపీ(Ycp) నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది.ఈ మేరకు మార్గాని భరత్, జక్కంపూడి రాజాలను తాడేపల్లికి రావాలని ఆ పార్టీ నాయకత్వం ఆదేశించింది.

 రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు పరస్పరం విమర్శలు చేసుకొన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సెల్ఫీ దిగడాన్ని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీకి నష్టం చేసేలా మార్గాని భరత్ వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.

also read:చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో తెలుసు: జక్కంపూడి రాజాకి మార్గాని భరత్ కౌంటర్

ఈ వ్యాఖ్యలకు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా  అదే స్థాయిలో కౌంటరిచ్చారు. పార్టీకి నష్టం చేసే విధంగా తాను ఏనాడూ వ్యవహరించలేదని ప్రకటించారు.  పార్టీకి నష్టం చేసేలా  ఎవరు వ్యవహరిస్తున్నారో తనకు తెలుసునన్నారు. కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది.ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకోవడంతో ఈ వ్యవహారం తారాస్థాయికి చేరుకొందని వైసీపీ నాయకత్వం గుర్తించింది. ఈ ఇద్దరి మధ్య సర్ధుబాటు చేయాలని భావించింది.

వైసీపీ తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జీ వైవీ సుబ్బారెడ్డి  మార్గాని భరత్, జక్కంపూడి రాజాలకు తాడేపల్లి రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల  28వ తేదీన ఇద్దరు నేతలు తాడేపల్లికి వెళ్లే అవకాశం ఉంది. తొలుత ఇద్దరు నేతల మధ్య చోటు చేసుకొన్న అభిప్రాయబేధాలపై వైవీ సుబ్బారెడ్డి చర్చించనున్నారు.అవసరమైతే ఈ ఇద్దరిని జగన్ వద్దకు వైవీ సుబ్బారెడ్డి తీసుకెళ్లే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్