2 తలలు, 6 కాళ్లు.. వింత దూడ జననం.. పుట్టిన కాసేపటికే..

Published : Sep 27, 2021, 01:41 PM IST
2 తలలు, 6 కాళ్లు.. వింత దూడ జననం.. పుట్టిన కాసేపటికే..

సారాంశం

యాదవపురానికి చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి దగ్గరున్న ఓ గేదె చూడిదయ్యింది. అయితే చూడి కట్టి 10 నెలలు అవుతున్నా ఈనలేదు. దీంతో అనుమానం వచ్చి గేదెను పశువైద్యుడి దగ్గరికి తీసుకువెళ్లాడు గోపాలకృష్ణ.

కృష్ణా జిల్లా : కొన్నిసార్లు విచిత్రాలు జరుగుతాయి. సాధారణానికి భిన్నంగా కొన్ని వింతలు చోటు చేసుకుంటాయి. అలాంటి వాటికి జన్యులోపాలో, మరే ఇతర విషయాలో కారణం అయి ఉంటాయి. కాకపోతే అలాంటి వింతలు, విచిత్రాలు వార్తా విశేషాలుగా మారతాయి. 

అలాంటి విచిత్ర ఘటనే కృష్ణా జిల్లా పామర్రులో చోటు చేసుకుంది. ఇక్కడి యాదవపురానికి చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి దగ్గరున్న ఓ గేదె చూడిదయ్యింది. అయితే చూడి కట్టి 10 నెలలు అవుతున్నా ఈనలేదు. దీంతో అనుమానం వచ్చి గేదెను పశువైద్యుడి దగ్గరికి తీసుకువెళ్లాడు గోపాలకృష్ణ.

దీంతో పశువైద్యుడు శశికుమార్ ఆ గేదెను పరీక్షించారు. ఈ పరీక్షల్లో గేదె కడుపులో ఉన్న దూడ ఆకృతి మామూలుగా లేదని... తేడా ఉందని దీనివల్లే కాన్పు ఆలస్యం అవుతోందని గమనించాడు. దీంతో వెంటనే గేదెకు శస్త్రచికిత్స చేసి దూడను బైటికి తీశారు. 

ఈ దూడను చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ దూడకు 2 తలలు, 6 కాళ్లు ఉన్నాయి. అయితే ఇలా విచిత్ర రూపంలో పుట్టిన జీవులు బతకడం చాలా అరుదు. అలాగే రెండు తలలు, నాలుగు కాళ్లతో పుట్టిన ఈ దూడ కూడా పుట్టిన కాసేపటికే మృతి చెందింది.

PREV
click me!

Recommended Stories

ఆ నీచానికి ఒడిగట్టింది మీరే | Perni Nani Fires On Chandrababu | Asianet Telugu
Earthquake: విశాఖను వణికించిన భూకంపం.. ఏపీ, తెలంగాణలో ఏయే ప్రాంతాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి?