కొత్త సంవత్సరం ఆరంభంలో విశాఖ నుంచి పాలన సాగించేలా చర్యలు.. వైవీ సుబ్బారెడ్డి

By Sumanth KanukulaFirst Published Dec 14, 2022, 2:35 PM IST
Highlights

రాష్ట్రంలోని ప్రజలకు మేలు జరుగుతుంటే ప్రతిపక్షాలు అక్కసుతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని వైసీపీ రీజినల్ కో ఆర్ఢినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. 

రాష్ట్రంలోని ప్రజలకు మేలు జరుగుతుంటే ప్రతిపక్షాలు అక్కసుతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని వైసీపీ రీజినల్ కో ఆర్ఢినేటర్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. పాలన వికేంద్రీకరణపై ప్రతిపక్షాలకు అసత్య ప్రచారమే పనిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖలో  వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలకు సీఎం జగన్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అంతా చూస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడ అమలు చేయని సంక్షేమ పథకాలను సీఎం జగన్ ‌అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. 

ఉత్తరాంధ్ర జిల్లాలను మిగిలిన ప్రాంతాలతో సమానంగా అభివృద్ది చేయాలని సీఎం జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా తీసుకురావాలని నిర్ణయించారని చెప్పారు. కొత్త సంవత్సరం ఆరంభంలో విశాఖ నుంచి పాలన సాగించే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాలను మిగిలిన ప్రాంతాలతో సమానంగా అభివృద్ది చేయాలని సీఎం జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా తీసుకురావాలని నిర్ణయించారని చెప్పారు. 

త్వరలో విశాఖ నుంచి పాలన యోచనలో సీఎం  ఉన్నారని తెలిపారు. ఇందుకు న్యాయపరమైన ఇబ్బందులన్నీ త్వరలోనే తొలగిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయం.. పార్టీ రాష్ట్ర కార్యాలయంగా మారనుందని అన్నారు. 

click me!