ఏపీ హైకోర్టులో చుక్కెదురు: ఫైన్ తగ్గించాలంటూ ఇప్పటం వాసులు దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణ

Published : Dec 14, 2022, 11:47 AM ISTUpdated : Dec 14, 2022, 12:05 PM IST
 ఏపీ హైకోర్టులో చుక్కెదురు:  ఫైన్ తగ్గించాలంటూ ఇప్పటం వాసులు దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణ

సారాంశం

ఇప్పటం వాసులకు ఏపీ హైకోర్టులో  చుక్కెదురైంది. ఇప్పటం వాసులకు  గతంలో విధించిన జరిమానాను తగ్గించాలని  దాఖలు చేసిన  పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.   

హైదరాబాద్: ఇప్పటం వాసులకు ఏపీ హైకోర్టులో బుధవారంనాడు  చుక్కెదురైంది.  ఇప్పటం వాసులకు విధించిన  జరిమానాను తగ్గించాలని  కోరుతూ  దాఖలు  చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు బుధవారంనాడు  తిరస్కరించింది.  మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇప్పటంలో అక్రమ నిర్మాణాల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు  గాను  14 మందికి  ఏపీ హైకోర్టు  లక్ష రూపాయాల చొప్పున  జరిమానాను విధిస్తూ ఏపీ హైకోర్టు ఈ ఏడాది నవంబర్  23న  ఆదేశాలు  జారీ చేసింది.  ఇప్పటంలో  అక్రమ నిర్మాణాలను  ప్రభుత్వం కూల్చివేతకు గాను నోటీసులు జారీ చేసింది. అయితే  తమకు  నోటీసులు జారీ చేసినా  కూడా  మున్సిపల్ అధికారులు  నోటీసులు జారీ చేయలేదని  పిటిషనర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేయవద్దని  హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ విషయమై  హైకోర్టుకు  మున్సిపల్ శాఖాధికారులు  సమాచారం ఇచ్చారు. పిటిషనర్లకు  ముందే  నోటీసులు ఇచ్చిన విషయాన్ని హైకోర్టుకు తెలిపారు.

also read:తప్పుడు సమాచారంతో స్టే: 14 మంది ఇప్పటం వాసులకు జరిమానా విధించిన ఏపీ హైకోర్టు

కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇళ్ల కూల్చివేతపై స్టే తీసుకున్న పిటిషనర్లపై  హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  14 మంది పిటిషనర్లకు  లక్ష రూపాయాల జరిమానాను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.అయితే ఈ జరిమానాను తగ్గించాలని కోరుతూ  పిటిషనర్లు ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ ను దాఖలు చేశారు.  పిటిషనర్ల ఇళ్లను కాపాడుకోవాలన్న ఉద్దేశ్యమని న్యాయవాది  హైకోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటంలో తమ పార్టీ సభ ఏర్పాటు చేసుకొనేందుకు స్థలం ఇచ్చినందుకే కక్షపూరితంగా  వ్యవహరించి ఇప్పటంలో  ఇళ్లను కూల్చివేశారని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇప్పటంలో  ఇళ్లు కోల్పోయిన  బాధితులకు పవన్ కళ్యాణ్  ఆర్ధిక సహాయం అందించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations