దారుణంగా వైసీపీ పరిస్థితి.. ప్రతిపక్ష హోదా అయినా దక్కేనా..?

By ramya Sridhar  |  First Published Jun 4, 2024, 2:09 PM IST

 వైసీపీ ఘోర పరాజయం మూట గట్టుకుంది.  టీడీపీ కి ఘన విజయం దక్కడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. 
 


ఆంధ్రప్రదేశ్ లో  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం  వైపు దూసుకుపోతోంది. వైసీపీ ఘోర పరాజయం మూట గట్టుకుంది.  టీడీపీ కి ఘన విజయం దక్కడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. 

ఉదయం కౌంటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి... కూటమి ఆధిక్యంలో దూసుకపోవడం మొదలుపెట్టింది. కూటమి విజయం సాధించినా.. వైసీపీ గట్టి పోటీ ఇస్తుందని చాలా మంది నమ్మారు. కానీ... కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేకపోయింది.  వార్ వన్ సైడ్ అయిపోయినట్లుగా ఫలితాలు వెలువడ్డాయి.  దాదాపు 90 శాతం మంది ప్రజలు కూటమికే జై కొట్టినట్లు ఫలితాలు చెబుతున్నాయి.

Latest Videos

undefined

ఇక... అసలు విషయానికి వస్తే.. ఫలితాల తీరు చూస్తుంటే...  వైసీపీ కి కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రతి పక్ష హోదా దక్కాలి అంటే.. కనీసం 18 మంది ఎమ్మెల్యే  సీట్లు అయినా గెలుపొందాలి.  ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు చూస్తుంటే..  అంతకంటే తక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తుది ఫలితాల్లోనూ... 18 మంది ఎమ్మెల్యే స్థానాలు కూడా గెలవకపోతే... వైసీపీ ప్రతిక్ష హోదా కూడా దక్కే పరిస్థితి కనపడటం లేదు..

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ప్రస్తుతం వైసీపీ కంటే.. జనసేన మెరుగైన ఫలితాలతో దూసుకుపోతోంది. జనసేన అభ్యర్థులు 20 మందికి పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. మరి... ఇలాంటి పరిస్థితిలో వైసీపీ ప్రతిపక్ష హోదా దక్కుతుందా లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది. 

click me!