వైసీపి నంద్యాల్లో అవినీతి సొమ్ము పంచుతుంది

Published : Aug 17, 2017, 08:20 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
వైసీపి నంద్యాల్లో అవినీతి సొమ్ము పంచుతుంది

సారాంశం

వైసీపి పార్టీ అవినీతితో సంపాధించిన సొమ్మును పంచుతున్నార‌ని ఆరొపించిన మంత్రి. నంద్యాల్లో జ‌గ‌న్ 9 రోజులుగా మ‌కాం వేసి అవినీతి సొమ్మును పంచుతున్నారని ఆరోపించారు సొమిరెడ్డి. బ్యాంక్ అకౌంట్లు తీసుకొని మ‌రీ ఓటర్ల బ్యాంక్‌ల్లో డబ్బులు వేస్తున్నారని ధ్వజం.

నంద్యాల ఉప ఎన్నిక‌లో వైసీపి పార్టీ అవినీతితో సంపాధించిన సొమ్మును పంచుతున్నార‌ని ఆరోపించారు మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి. జ‌గ‌న్‌, త‌మ పార్టీ నేత‌లు నంద్యాల ప్ర‌జ‌ల‌ను డబ్బుతో మ‌భ్య‌పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. గురువారం నంద్యాల ప్ర‌చారంలో భాగంగా మీడియా తో మాట్లాడిన మంత్రి వైసీపి అధ్య‌క్షుడు జ‌గ‌న్‌పై, వైసీపి అభ్య‌ర్థి శిల్పామోహాన్ రెడ్డి పై ధ్వ‌జ‌మెత్తారు

నంద్యాల్లో జ‌గ‌న్ 9 రోజులుగా మ‌కాం వేసి అవినీతి సొమ్మును పంచుతున్నారని ఆరోపించారు సొమిరెడ్డి. ప్ర‌జ‌ల వ‌ద్ద బ్యాంక్ అకౌంట్లు తీసుకొని మ‌రీ ఓటర్ల బ్యాంక్‌ల్లో డబ్బులు వేస్తున్నారని ఆయ‌న‌ అన్నారు. నంద్యాలలో గెలుపు కోసం జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపి పార్టీ త‌మ అభ్య‌ర్థి పై గెలవ‌లేక‌నే జ‌గ‌న్ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని పెర్కొన్నారు. తనకు ఆస్తులు‌ లేవని జగన్‌ నంద్యాలలో బీద అరుపులు అరుస్తున్నారని ఎద్దేవా చేశారు, అవినీతితో సంపాధించిన వేల కోట్ల ఆస్తులు ఎవరివో చెప్పాల‌ని ఆయ‌న ప్రశ్నించారు. జగన్ మాటలను నంద్యాల ప్రజలు నమ్మరని సోమిరెడ్డి అన్నారు. టీడీపీ త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్