వినుకొండలో గ్యాంగ్ వార్... బీరు సీసాలతో టిడిపి, వైసిపి శ్రేణుల వీరంగం

Published : May 02, 2023, 10:22 AM IST
 వినుకొండలో గ్యాంగ్ వార్... బీరు సీసాలతో టిడిపి, వైసిపి శ్రేణుల వీరంగం

సారాంశం

సోషల్ మీడియాలో ప్రభత్వ వ్యతిరేక పోస్టింగ్ అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి కార్యకర్తల మధ్య బీరు సీసాలు, కర్రలతో దాడులకు దారితీసింది. ఈ ఘటన పల్నాడు జిల్లా వినుకొండలో చోటుచేసుకుంది. 

వినుకొండ : ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల కంటే సోషల్ మీడియా రాజకీయాలే ఎక్కువయ్యాయి. ప్రధాన పార్టీలన్ని సోషల్ మీడియా విభాగాలను ఏర్పాటుచేసుకున్నాయంటేనే రాజకీయాలపై వాటి ప్రభావం ఎంతలా వుందో అర్థమవుతుంది. పార్టీలే సోషల్ మీడియా  బాటపడితే సాధారణ కార్యకర్తులు ఊరికే వుంటారా... వారు కూడా అదే బాటపట్టారు. అయితే సోషల్ మీడియాలో రాజకీయ పోస్టులు ఒక్కోసారి పార్టీల మధ్య గొడవలకు దారితీస్తున్నారు. ఇలా ఫేస్ బుక్ పోస్టింగ్ పల్నాడు జిల్లాలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి శ్రేణుల గొడవకు కారణమయ్యింది.

వినుకొండకు చెందిన షేక్ ఇమ్రాన్  తెలుగుదేశం పార్టీ, అష్రాఫ్ వైసిపి చెందిన కార్యకర్తలు. ఇటీవల వైసిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇమ్రాన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దీనికి వ్యతిరేకంగా అష్రాఫ్ కామెంట్ చేసాడు. ఇలా ఇద్దరిమధ్య సోషల్ మీడియాలో ప్రారంభమైన గొడవ గ్యాంగ్ వార్ కు దారితీసింది. 

ఇమ్రాన్, అష్రాఫ్ సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకుని గత శనివారం వినుకొండ ఏడిబి బిల్డింగ్ వద్దకు అనుచరులో చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. స్థానికులు వారికి సర్దిచెప్పి అక్కడినుండి పంపించడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది. 

Video  గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేని నిలదీసిన సొంత పార్టీ కార్యకర్తలు... ఉద్రిక్తత

అయితే ఆదివారం మరోసారి ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. బంధువుల ఇంట శుభకార్యానికి ఇమ్రాన్ వెళ్లినట్లు తెలుసుకున్న అష్రాఫ్ అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లి గొడవచేసాడు. దీంతో ఇమ్రాన్ కూడా తన అనుచరులను పిలుచుకోవడంతో మరోసారి ఇరువర్గాలు రోడ్డుపైనే కొట్టుకున్నారు. కర్రలతో దాడి చేసుకుంటూ బీరు సీసాలు విసురుకుంటూ కారంపూడి రోడ్డులో నానా హంగామా సృష్టించారు. 

ఇరువర్గాల గొడవపై సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న వారిముందే ఇమ్రాన్, అష్రాఫ్ వర్గీయులు దాడులు చేసుకున్నారు. దీంతో లాఠీలకు పనిచెప్పిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. టిడిపి, వైసిపి కార్యకర్తల గొడవతో వినుకొండలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

ఈ గొడవకు ఇమ్రాన్ సోషల్ మీడియా పోస్టింగే కారణమంటూ అతడితో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసారు. అధికార పార్టీకి చెందినవారిపై పోలీసులు కేసులు నమోదు చేయకపోవడంతో టిడిపి శ్రేణులు భగ్గుమంటున్నాయి. గొడవకు దిగిన అందరిపైనా కేసు నమోదు చేయకుండా కేవలం టిడిపి కార్యకర్తలపైనే కేసు నమోదు చేయడం ఏమిటని పోలీసులను ప్రశ్నిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!