తిరుమలలో ఉగ్రవాదుల కలకలం.. క్లారిటీ ఇచ్చిన ఎస్పీ.. ఏమన్నారంటే..

Published : May 02, 2023, 09:11 AM IST
తిరుమలలో ఉగ్రవాదుల కలకలం.. క్లారిటీ ఇచ్చిన ఎస్పీ.. ఏమన్నారంటే..

సారాంశం

తిరుమలలో ఉగ్రవాదుల సంచారం మీద వచ్చిన మెయిల్ ఫేక్ అని.. భక్తులు అలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఎస్పీ కోరారు. 

తిరుమల : తిరుమలలో ఉగ్రవాదుల కలకలం అని వచ్చిన వార్తల్లో నిజం లేదని..  అదంతా అసత్య ప్రచారమని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు. పోలీస్, టిటిడి విజిలెన్స్ యంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉందని అన్నారు.  ఉగ్రవాదుల నుంచి వచ్చినదిగా పేర్కొంటున్న మెయిల్ ఫేక్ అని తెలిపారు. తిరుమలలో ఉగ్రవాదుల సంచారం ఏమాత్రం లేదని.. ఇలాంటి అసత్య ప్రచారాలను భక్తులు నమ్మవద్దని ఆయన కోరారు.

ఇదిలా ఉండగా,  సోమవారం రాత్రి సమయంలో తిరుమలలో భద్రతాధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక మెయిల్ వచ్చిందని.. ఉగ్రవాదులు చొరబడ్డారు అంటూ అందులో పేర్కొన్నారని తేలింది. దీంతో తిరుపతి అర్బన్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలుగా అప్రమత్తమయ్యారు.  దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతాధికారులను కూడా పోలీసు అధికారులు అప్రమత్తం చేశారు.

కాకినాడలో విషాదం.. ఆడుకుంటూ కారులోకి వెళ్లిన చిన్నారి.. డోర్ లాక్ అవడంతో ఊపిరాడక మృతి

కాగా ఇటీవల తిరుమలలో సులభ్ కార్మికుల సమ్మె జరిగింది.. ఆ సమయంలో కార్మికుల రూపంలో తిరుమలకి ఉగ్రవాదులు వచ్చి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ భద్రతాధికారులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా, ఈ ఉగ్రవాదుల చొరబాటుని పోలీసు శాఖ అధికారికంగా ధ్రువీకరించలేదు. దీంతో టీటీడీ విజిలెన్స్ పోలీసులు తిరుమలలో  విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో భయాందోళనలు నెలకొన్న క్రమంలో ఆ మెయిల్ ఫేక్ అని పోలీసులు తేల్చారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu