అమరావతి మండలం జూపూడిలో శివాజీ విగ్రహం ధ్వంసం: ఉద్రిక్తత

Published : May 02, 2023, 09:40 AM IST
అమరావతి మండలం జూపూడిలో శివాజీ విగ్రహం ధ్వంసం:  ఉద్రిక్తత

సారాంశం

  అమరావతి మండలం జూపూడిలో  శివాజీ విగ్రహన్ని  గుర్తు తెలియని వ్యక్తులు  నిన్న రాత్రి ధ్వంసం  చేశారు.  ఈ విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు.

అమరావతి: పల్నాడు  జిల్లాలోని అమరావతి మండలం జూపూడిలో   ఉద్రిక్తత చోటు  చేసుకుంది.   ఛత్రపతి శివాజీ విగ్రహన్ని గుర్తు తెలియని దుండగులు  సోమవారంనాడు రాత్రి
ధ్వంసం  చేశారు. విగ్రహం తల, మొండెం వేరు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన  స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.   పోలీసుల సూచన మేరకు  విగ్రహనికి తలను, మొండెం  అతికించారు.  భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు  పునరావృతం కాకుండా ఉండేందుకు గాను  విగ్రహం ఏర్పాటు  చేసిన చోట సీసీ కెమెరాలను  ఏర్పాటు  చేయాలని  స్థానికులు డిమాండ్  చేస్తున్నారు. 

ఈ గ్రామంలో  రెండు  సామాజిక వర్గాల మధ్య   గతంలో వివాదాలు చోటు  చేసుకున్నాయి.  ఈ గొడవలు  పోలీస్ స్టేషన్ల వరకు  చేరాయి.   ఈ గొడవల నేపథ్యంలోనే  ఈ ఘటన చోటు  చేసుకుందా  మరే ఇతర కారణాలున్నాయా  అనే  విషయమై  పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ విగ్రహన్ని ధ్వంసం  చేసిన  వారెవరనే విషయమై  పోలీసులు విచారిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

ప్ర‌ధాని మోదీతో గంట‌న్న‌ర స‌మావేశ‌మైన సీఎం చంద్ర‌బాబు.. ఏం మాట్లాడ‌రంటే.?
Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం