నర్సరావుపేట ఎంపీ అభ్యర్ధిగా అనిల్ కుమార్ యాదవ్ .. వైసీపీ ఐదో జాబితా ఇదే

By Siva Kodati  |  First Published Jan 31, 2024, 8:33 PM IST

త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు  సంబంధించి వైసీపీ ఐదో జాబితాను విడుదల చేసింది. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆమోదముద్ర అనంతరం అభ్యర్ధుల పేర్లను మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిలు విడుదల చేశారు. 


త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు  సంబంధించి వైసీపీ ఐదో జాబితాను విడుదల చేసింది. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆమోదముద్ర అనంతరం అభ్యర్ధుల పేర్లను మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిలు విడుదల చేశారు. నాలుగు ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాల్లో జగన్ మార్పులు చేశారు. అందరూ ఊహించినట్లుగానే మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. నర్సరావుపేట లోక్‌సభ బరిలో దిగనున్నారు. 

మచిలీపట్నం (ఎంపీ) - సింహాద్రి రమేశ్ బాబు
నర్సరావుపేట (ఎంపీ) -   అనిల్ కుమార్ యాదవ్
తిరుపతి (ఎంపీ) - గురుమూర్తి
కాకినాడ (ఎంపీ) - చలమలశెట్టి సునీల్

Latest Videos

అరకు (ఎమ్మెల్యే) - రేగం మత్స్యలింగం
సత్యవేడు (ఎమ్మెల్యే) - నూకతోటి రాజేష్
అవనిగడ్డ (ఎమ్మెల్యే) - డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరడంతో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును ఈ స్థానంలో ఇన్‌ఛార్జ్‌గా నియమించారు జగన్.  అలాగే నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేయడంతో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను ఈ స్థానంలో బరిలోకి దింపింది. తిరుపతి ఎంపీగా గురుమూర్తికి మరోసారి అవకాశం కల్పించారు వైసీపీ అధినేత. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను ఈసారి ఎంపీగా పంపించడంతో ఆయన బంధువు సింహాద్రి చంద్రశేఖర్ రావును ఇన్‌ఛార్జ్‌గా నియమించారు జగన్. 

కాగా.. ఇప్పటి వరకు ఐదు జాబితాలను ప్రకటించింది వైసీపీ. వీరిలో 61 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు వుండగా.. 14 మంది ఎంపీ అభ్యర్థులు వున్నారు. మొత్తంగా 30 మంది  సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ మొండిచేయి ఇచ్చారు. వీలైనంత త్వరలో అభ్యర్ధుల ఎంపికను కొలిక్కి తీసుకొచ్చి.. ప్రచార రంగంలో దిగాలని జగన్ భావిస్తున్నారు. 

 


 

click me!