ఫిరాయింపు ఎమ్మెల్యేలను వైసీపీ ఖాతాలో వేసిన స్పీకర్ కోడెల

By Nagaraju penumalaFirst Published Feb 8, 2019, 6:26 PM IST
Highlights

మరోవైపు అసెంబ్లీలో బీజేపీ సభ్యుల సంఖ్య మూడు అని చదివారు. అంటే ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీ నుంచి ఉన్నది ముగ్గురే ఒకరు పెనుమత్స విష్ణుకుమార్ రాజు, పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్. ఇకపోతే ఇదే బీజేపీ నుంచి రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ రాజీనామా చేశారు. 
 

అమరావతి: పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే వేశారు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. అసెంబ్లీ ముగింపు సమావేశాల సందర్భంగా పార్టీల పరిస్థితులు సమావేశాలకు హాజరైన విధానం, శాసన సభ్యుల సంఖ్యపై వివరించారు. 

ఫిబ్రవరి ఫస్ట్ వరకు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యుల ప్రాతినిధ్యం 100, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 66, భారతీయ జనతా పార్టీ 3, నవోదయం పార్టీ వన్, ఇండిపెండెంట్ వన్, నామినేటెడ్ వన్, ఖాళీ 4 అని చెప్పారు. మెుత్తం సభ్యుల సంఖ్య 176గా స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పుకొచ్చారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అంతేకాదు కొంతమందికి మంత్రి పదవులను సైతం కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో వారిని తెలుగుదేశం పార్టీలో కలపకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగానే స్పీకర్ ప్రకటించారు. 

మరోవైపు అసెంబ్లీలో బీజేపీ సభ్యుల సంఖ్య మూడు అని చదివారు. అంటే ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీ నుంచి ఉన్నది ముగ్గురే ఒకరు పెనుమత్స విష్ణుకుమార్ రాజు, పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్. ఇకపోతే ఇదే బీజేపీ నుంచి రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ రాజీనామా చేశారు. 

ఆ విషయాన్ని గుర్తించి వారిని కౌంట్ లోకి తీసుకోకుండా వేకెంట్ లో పెట్టారు. అంతేకాదు అసెంబ్లీలో పార్టీల ప్రాతినిధ్యం వాటి వివరాలు ఫిబ్రవరి 1 2019 నుంచి అని చెప్పిన కోడెల ఛాన్నాళ్ల క్రితం పార్టీ మారిన వారిని ఎందుకు తెలుగుదేశం పార్టీ సభ్యులుగా గుర్తించడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

అన్నీ అప్ డేట్ అయిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారడం, మంత్రిపదవుల పొంది ఆయన ఎదురుంగానే అసెంబ్లీలో కూర్చున్నా ఎందుకు అప్ డేట్ కాలేదోనని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. 

click me!