వైసీపీలో అలజడి: వదిలేది లేదంటున్న జగన్, సుజనా చౌదరిపై పెద్దప్లానే

By Nagaraju penumalaFirst Published Nov 23, 2019, 4:56 PM IST
Highlights

2018 నవంబర్ లో జీవీఎల్ నరసింహారావు ఎంపీ సుజనా చౌదరిపై ఫిర్యాదు చేశారు. సరిగ్గా ఏడాది లోపే వైసీపీ కూడా ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో సుజనాను వదిలే ప్రసక్తే లేదని వైసీపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారట.  

అమరావతి: బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ బాంబు పేల్చారు సుజనాచౌదరి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న రాజకీయాలు కాస్త వేడెక్కాయి. 

సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు శీతాకాలంలో అగ్గిరాజేస్తున్నాయి. బీజేపీతో వైసీపీ ఎంపీలు టచ్ లో ఉన్నారంటూ సుజనాచౌదరి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. 22 మంది ఎంపీలు తమదైన శైలిలో సుజనాపై విరుచుకుపడ్డారు. 

కొందరు ఎంపీలైతే గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మెుత్తానికి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు మాత్రం వైసీపీ శిబిరాన్ని ఓ కుదుపు కుదిపేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తమ పార్టీలో ఏం జరగడం లేదని ప్రజలకు వివరించేందుకు తల ప్రాణం కాస్త తోక వరకు వచ్చేసిందంటే ఎంతలా ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవచ్చు. 

సుజనా చౌదరి వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ నాయకత్వం సైతం మూడో కన్ను తెరిచినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఎంపీల పర్యటనలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఎంపీలు ఎవరిని కలుస్తున్నారు, ఎందుకు కలుస్తున్నారు అనే అంశంపై కూపీలాగేందుకు వైసీపీ నాయకత్వం వ్యూహరచన చేస్తోందట. 

ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉన్న పార్టీలో చిచ్చుపెట్టడంతో సుజనాచౌదరిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారట వైసీపీ ఎంపీలు. సుజనా చౌదరిపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే పలుమార్లు వైసీపీ ఎంపీలు సుజనా చౌదరికి హెచ్చరించారు. తమ పార్టీ జోలికి వస్తే సహించేది లేదని ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని కూడా తేల్చి చెప్పింది. అయినప్పటికీ సుజనా చౌదరిలో ఎలాంటి మార్పులు రాకపోవడంతో ఆగ్రహంతో ఉన్న వైసీపీ ఎంపీలు ఇక ఉపేక్షించకూడదని నిర్ణయానికి వచ్చారట. 

సుజనా పదవికి ఎసరు: చట్టం తెస్తామంటూ వైసీపీ ఎంపీ వార్నింగ్

ఇప్పటికే శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో సుజనా చౌదరిపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసేందుకు వ్యూహరచన చేస్తోందట. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా చౌదరిలాంటి వాళ్లకు చట్ట సభల్లో అడుగుపెట్టే అర్హత లేదంటూ ఫిర్యాదు చేయనుందట. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వ్యక్తులు చట్ట సభల్లో అడుగుపెట్టకుండా ఉండేలా చూడాలంటూ ప్రత్యేకంగా ప్రైవేట్ బిల్లు పెట్టేందుకు వైసీపీ రంగం సిద్ధం చేస్తోంందని తెలుస్తోంది. 

ఇకపోతే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సుజనా చౌదరిపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న సమయంలో సుజనా చౌదరీ, సీఎం రమేశ్ లను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

రోజా సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఆ భయంతోనే వాళ్ళ కాళ్లు పట్టుకుని బీజేపీలో చేరాడు

2018 నవంబర్ లో జీవీఎల్ నరసింహారావు ఎంపీ సుజనా చౌదరిపై ఫిర్యాదు చేశారు. సరిగ్గా ఏడాది లోపే వైసీపీ కూడా ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో సుజనాను వదిలే ప్రసక్తే లేదని వైసీపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారట. నిజంగా ఇదిగనుక జరిగితే మళ్లీ ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి.

మేము తలచుకుంటే ఏమౌతావ్, నీకు దమ్ముంటే....: సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీలు ఫైర్

click me!