Andhra Pradesh : తెలంగాణలో సీమాంధ్ర ఓటర్లు ... ఎలక్షన్ కమీషన్ కు ఏపీ మంత్రుల పిర్యాదు

By Arun Kumar P  |  First Published Nov 29, 2023, 11:23 AM IST

తెలంగాణలో సీమాంద్రులకు ఓటు హక్కు కలిగివుండటంపై వైసిపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తోంది. ఇలా రెండురాష్ట్రాల్లో ఓటుహక్కు కలిగివుండపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్ చేస్తోంది. 


అమరావతి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్ లో కీలక  పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలో చాలామంది సీమాంధ్రులు ఓటుహక్కు కలిగివున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ తో పాటు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో సీమాంధ్ర ఓటర్లు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో వున్నారు. అయితే ఇలా తెలంగాణలో ఓటుహక్కు కలిగివారిలో కొందరికీ ఏపీలోనూ ఓటుహక్కు వుంది. ఇలా రెండురాష్ట్రాల్లో ఓట్లు కలిగివుండటంపై ఏపీ మంత్రులు, వైసిపి నాయకులు రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేయనున్నారు.  

ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాను మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కలవనున్నారు. రాష్ట్రంలో నకిలీ ఓట్లు, పలుప్రాంతాల్లో ఓట్ల తొలగింపుపై ప్రతిపక్ష టిడిపి ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై వైసిపి కూడా ఈసికి ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యింది. నకిలీ ఓట్ల నమోదుకు వైసిపి కారణమంటూ టిడిపి చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు వైసిపి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో నమోదయిన నకిలీ ఓట్లను తొలగించాలని ఈసిని కోరడంద్వారా ఓటర్ల నమోదులో తామేమీ అక్రమాలకు పాల్పడలేదని వైసిపి బయటపెడుతోంది. 

Latest Videos

undefined

ఇక తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి తెలంగాణ పలితాల ఎఫెక్ట్ ఏపీ ఎన్నికలపై వుండకుండా వైసిపి జాగ్రత్త పడుతోంది. ఇందుకోసమే ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటు కలిగిన కలిగివున్నవారు ఎక్కడో ఒకచోటే ఓటుహక్కు వినియోగించుకునేలా చూడాలని ఈసిని వైసిపి నాయకులు కోరనున్నారు.  

Read More  Telangana Elections 2023 : ఓటర్ స్లిప్పు అందలేదా? ఓటు ఉందో, లేదో అన్న అనుమానమా? ఇలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు..

ఇదిలావుంటే ఏపీలో భారీగా నకిలీ ఓట్లు నమోదయ్యాయని ఇప్పటికే టిడిపి నాయకులు ఈసికి ఫిర్యాదు చేసారు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసిపి ఈ దొంగఓట్ల నమోదు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. టిడిపి చీఫ్ చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ఎలక్షన్ కమీషన్ ను కలిసి ఈ నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేసారు. వైసిపి కూడా ఇప్పటికే నకిలీ ఓట్ల నమోదు పై ఈసికి పలుమార్లు ఫిర్యాదు చేసింది. తాజాగా మరోసారి మంత్రులు సిఈవో మీనాకు పిర్యాదు చేయనున్నారు. 
 

click me!