Nandyal : ఆరుగురు స్టూడెంట్స్ కు శిరోముండనం... ఓ కాలేజీ సిబ్బంది ఓవరాక్షన్

Published : Nov 29, 2023, 09:09 AM ISTUpdated : Nov 29, 2023, 09:15 AM IST
Nandyal : ఆరుగురు స్టూడెంట్స్ కు శిరోముండనం... ఓ కాలేజీ సిబ్బంది ఓవరాక్షన్

సారాంశం

నంద్యాల పట్టణంలో చోటుచేసుకున్న అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు సిబ్బంది శిరోముండనం చేసారు.   

నంద్యాల : కాలేజీ యాజమాన్యమే విద్యార్థులకు శిరోముండనం చేసి అవమానించిన అమానుష ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగుచూసింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన కాలేజీ సిబ్బంది ఇలా విద్యార్థులతో దారుణంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కాలేజీ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే... నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. గత సోమవారం రాత్రి జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య  మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు పరస్పర దాడులకు దిగారు. ఈ  గొడవలో పలువురు విద్యార్థులకు స్పల్ప గాయాలపాలయ్యారయి. 

అయితే ఈ విద్యార్థుల గొడవ గురించి తెలిసి కాలేజీ సిబ్బంది అతిగా ప్రవర్తించారు. అప్పటికే గొడవ కారణంగా గాయపడ్డ విద్యార్థులను కాలేజీ సిబ్బంది మరోసారి కర్రలతో దాడిచేసారు. అంతటితో ఆగకుండా ఆరుగురు విద్యార్థులకు శిరోముండనం (గుండు కొట్టి) చేసి అవమానించారు. 

Read More  తూర్పుగోదావరి జిల్లాలో కాల్పులు.. డాక్యుమెంట్‌ రైటర్ దారుణ హత్య

కాలేజీ సిబ్బంది విచక్షణారహితంగా దాడిచేయడంలో ఓ విద్యార్థి చేయి విరిగినట్లు తెలుస్తోంది. గొడవ పడ్డ విద్యార్థులను మందలించి వదిలేయాల్సింది పోయి మరింత గాయపర్చడం.... గుండు కొట్టి అవమానించడం ఏమిటంటూ కాలేజీ యాజమాన్యంపై తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. ఈ ఘటన నంద్యాలలో చర్చనీయాంశంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!