నిమ్మగడ్డపై విమర్శలు..చివరి నిమిషంలో వెనక్కి: అఖిలపక్షానికి వైసీపీ డుమ్మా

By Siva KodatiFirst Published 27, Oct 2020, 10:24 PM
Highlights

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమీషన్ రేపు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వైసీపీ గైర్హాజరు కానుంది. చివరి నిమిషంలో వైసీపీ తన వైఖరి మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమీషన్ రేపు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వైసీపీ గైర్హాజరు కానుంది. చివరి నిమిషంలో వైసీపీ తన వైఖరి మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.

రేపటి అఖిలపక్ష సమావేశానికి హాజరుకావొద్దని నిర్ణయం తీసుకుంది వైసీపీ అధిష్టానం.  పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ఇందుకు సంబంధించిన ప్రెస్ నోటు విడుదల చేశారు.

సమావేశానికి ముందు సుప్రీంకోర్టు.. ఏ తీర్పు ఇచ్చిందో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చదువుకోవాలని సూచించారు అంబటి. ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభించాలంటే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను తీసుకోవాలని సుప్రీం స్పష్టం చేసిందన్నారు అంబటి.

Also Read:జగన్ విముఖత: రేపటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీపై ఆసక్తి

మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీ ఇచ్చే అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ముందు రాజకీయ పార్టీలను పిలవడంలో వేరే ఉద్దేశ్యాలు ఉన్నాయంటూ ఆయన ఆరోపించారు. దీంతో ఈ సమావేశానికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు అంబటి. 

రేపు ఉదయం 10.30 గంటల నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివిధ పార్టీల ప్రతినిధులు కలుసుకుంటారు. పార్టీల ప్రతినిధులను ఆయన విడివిడిగా కలుసుకుని అభిప్రాయాలు సేకరిస్తారు. వారి అభిప్రాయాలను రాతపూర్వకంగా కూడా సమర్పించాలని ఎస్ఈసీ కోరింది. ఒక్కో పార్టీకి ఎస్ఈసీ ఒక్కో సమయం కేటాయించింది.

గడ్డ రమేష్ కుమార్ వివిధ పార్టీలకు ఇప్పటికే ఆహ్వానం పంపించారు. తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలు కొన్ని స్థానిక సంస్థల నిర్వహణకు సుముఖంగా ఉన్నాయి. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం విముఖత ప్రదర్శిస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రస్తుత పరిస్థితులో నిర్వహించడం సాధ్యం కాదని మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, కొడాలి నాని స్పష్టంగానే చెప్పారు. కోవిడ్ రెండో వేవ్ ప్రమాదం నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని వారన్నారు. 
 

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 27, Oct 2020, 11:07 PM