వెంకయ్యకు క్షమాపణలు చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎందుకంటే?

First Published Jul 25, 2018, 12:55 PM IST
Highlights

 వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  బుధవారం నాడు  రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడుకు క్షమాపణలు చెప్పారు. మంగళవారం నాడు రాజ్యసభలో చోటు చేసుకొన్న పరిణామాలపై పలు పార్టీలు డిమాండ్ చేసిన మీదట  విజయసాయిరెడ్డి  రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడుకు క్షమాపణలు చెప్పారు.

న్యూఢిల్లీ: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  బుధవారం నాడు  రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడుకు క్షమాపణలు చెప్పారు. మంగళవారం నాడు రాజ్యసభలో చోటు చేసుకొన్న పరిణామాలపై పలు పార్టీలు డిమాండ్ చేసిన మీదట  విజయసాయిరెడ్డి  రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడుకు క్షమాపణలు చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీ చట్టంపై  మంగళవారం నాడు రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. అయితే  విజయసాయిరెడ్డి మాట్లాడుతున్న సమయంలోనే  సమయం ముగిసిందని రాజ్యసభ ఛైర్మెన్  వెంకయ్యనాయుడు  ప్రకటించారు. దీంతో విజయసాయిరెడ్డి  తీవ్రంగా స్పందించారు. ఛైర్మెన్ ఏకపక్షంగా  వ్యవహరిస్తున్నారని వెల్‌లో‌కి దూసుకెళ్లి  నిరసన వ్యక్తం చేశారు.  

విజయసాయిరెడ్డి తీరుపై రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు మండిపడ్డారు.  అయితే సభలో తమకు సమయం సరిగా ఇవ్వలేదనే  అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ   విజయసాయిరెడ్డి రాజ్యసభ నుండి  వాకౌట్ చేశారు. 

ఇదిలా ఉంటే బుధవారం నాడు రాజ్యసభ ప్రారంభం కాగానే  నిన్న సభలో చోటు చేసుకొన్న పరిణామాలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి విజయ్‌గోయల్  మాట్లాడారు. విజయసాయిరెడ్డి వ్యవహరించిన తీరుపై  రాజ్యసభ ఛైర్మెన్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఆజాద్ కూడ ఈ విషయమై ఆయన మద్దతు ప్రకటించారు.

సభలో సమయం సరిపోకపోతే  సమయాన్ని పొడిగించాలని  కోరాలే తప్ప.. ఇష్టమొచ్చినట్టు వ్యవహరించకూడదని ఛైర్మెన్ సూచించారు.నిన్నటి ఘటనలో వివరణ ఇవ్వాల్సిన పనిలేదన్నారు. అంతేకాకుండా క్షమాపణలు కూడ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈ తరుణంలో కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్  లేచి క్షమాపణలు చెప్పాలని విజయసాయిరెడ్డిని కోరారు. దీంతో విజయసాయిరెడ్డి  నిన్నటి ఘటనకు  తాను క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించారు. 

click me!