జ్ఞాపకశక్తి తగ్గిందని లోకేష్‌కి పార్టీ పగ్గాలిస్తారంట: బాబుపై విజయసాయి సెటైర్లు

By narsimha lodeFirst Published Aug 19, 2020, 6:11 PM IST
Highlights

టీడీపీ చీఫ్ చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ఆయన బాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీ వ్యవహారాలను కొడుకుకు అప్పగించాలని అనుకొంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. 

అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ఆయన బాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీ వ్యవహారాలను కొడుకుకు అప్పగించాలని అనుకొంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. జ్ఞాపకశక్తి తగ్గడంతో కొడుకుకి పార్టీ పగ్గాలు ఇస్తారంట అని ఆయన చంద్రబాబుపై కామెంట్స్ చేశారు. 

కరోనా ఉధృతి తగ్గగానే లోకేష్ ను కాబోయే సీఎంగా ప్రకటించేందుకు వీలుగా సైకిల్ యాత్ర చేయించాలని ఎల్లో మీడియా ముఖ్యులు రూట్ మ్యాప్ ఇచ్చారంట అని ఆయన చెప్పారు.  కరోనా కారణంగా కొంతకాలంగా బాబుపై విమర్శలకు ట్విట్టర్ కు దూరంగా ఉన్న విజయసాయిరెడ్డి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ట్విట్టర్ వేదికగా మరోసారి బాబుపై విమర్శలను ఎక్కుపెట్టారు.

 

బాబు నాయుడు...
ప్రధానిని, ఆయన కుటుంబాన్ని తిట్టిన నోటితోనే ఆయన నాయకత్వాన్ని పొగిడారు.
సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ ఏపీలోకి రావటానికి వీల్లేదన్న నోటితోనే కేంద్ర ప్రభుత్వ విచారణ కావాలంటున్నారు.
ఇంకా ఇలాంటి చిత్ర విచిత్రాలు, విడ్డూరాలు ఎన్ని చూడాలో మరి..!

— Vijayasai Reddy V (@VSReddy_MP)

 

పార్టీ వ్యవహారాలను కొడుకుకు అప్పగించాలని బాబు గారు అనుకుంటున్నారా? వయసు పెరగడం, జ్ఞాపకశక్తి క్షీణించడంతో కుమారుడికి పగ్గాలు ఇస్తారంట. కరోనా ఉధృతి తగ్గగానే లోకేశ్ నాయుడును ‘కాబోయే సీఎం'గా ఎలివేట్ చేసేలా సైకిల్ యాత్ర చేయించాలని ఎల్లో మీడియా ముఖ్యులు రూట్ మ్యాప్ ఇచ్చారంట.

— Vijayasai Reddy V (@VSReddy_MP)

మరో ట్వీట్ లో కూడ బాబుపై ఆయన మండిపడ్డారు. తిట్టిన నోటితోనే ప్రధాని నాయకత్వాన్ని పొగిడారని ఆయన గుర్తు చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్‌ఐఏ ఏపీలోకి రావడానికి వీల్లేదన్న నోటితోనే కేంద్ర సంస్థల విచారణలను బాబు కోరుకొంటున్నాడని ఆయన చెప్పారు. ఈ రకమైన చిత్ర, విచిత్రాలు ఎన్నిక చూడాలో మరి అని ఆయన విమర్శించారు. 
 

click me!